అఖిల ప్రియను బాబు ముంచేటట్టే ఉన్నాడు..

నంద్యాల ఉప ఎన్నికల వ్యవహారం టీడీపీలో రోజుకో మలుపుతిరుగుతోంది. భూమా నాగిరెడ్డి కుటుంబానికే టికెట్ ఇవ్వాలని ఇప్పటికే మంత్రి అఖిల ప్రియతో పాటు వారితో సన్నిహితంగా ఉండే వారు చంద్రబాబుకు స్పష్టం చేశారట.. శిల్పాకు ఇస్తే ఓడిస్తామని చెప్పారు. దీంతో అలకవహించిన శిల్పా మోహన్ రెడ్డి… జగన్ మోహన్ రెడ్డిని కలిసి వైసీపీలో చేరిపోయారు. ఇక అఖిలప్రియ కుటుంబానికే టికెట్ అనుకుంటున్న సమయంలో మరోసారి కథ అడ్డం తిరిగింది..

భూమా నాగిరెడ్డి బతికున్న సమయంలో ఆయన ఆప్తమిత్రుడు, ఏవీ సుబ్బారెడ్డి  ఆయనతో కలిసి నియోజకవర్గంలో చురుగ్గా పాలుపంచుకునేవారు. కానీ భూమా మరణం తర్వాత ఆయన ప్రాధాన్యం తగ్గిపోయింది. మంత్రి అఖిల ప్రియ… ఏవీ సుబ్బారెడ్డిని దూరం పెట్టారు. ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డి భూమా నాగిరెడ్డి స్తానంలో తనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని బాబును కోరాడట.. దీంతో అఖిల ప్రియ, సుబ్బారెడ్డి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. చంద్రబాబును సందిగ్ధంలోకి నెట్టాయి.

ఇక టీడీపీ తరఫున నంద్యాల సీటుపై చాలా మంది ఆశలు పెంచుకున్నారు. భూమా సోదరుడు బ్రహ్మానందారెడ్డి, మాజీ మంత్రి ఫరూక్, ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డిలు కూడా తమకే టీడీపీ సీటు ఇప్పించాలని చంద్రబాబుకు అల్టీమేటం జారీ చేశారు. దీంతో నంద్యాల సీటు భూమా కుటుంబానికి ఇద్దామనుకుంటున్న బాబుకు ఇప్పుడు సుబ్బారెడ్డి తెరపైకి రావడంతో సందిగ్ధంలో పడ్డారు. శనివారం విజయవాడలో నంద్యాల ఉప ఎన్నికపైనే సమావేశం నిర్వహించారు. మొత్తంగా వస్తున్న వార్తలను బట్టి చూస్తే బాబు అఖిల ప్రియకు షాక్ ఇచ్చి పై ముగ్గురిలో ఒకరికి ఎమ్మెల్యే సీటు కట్టబెట్టడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మొత్తంగా భూమా అఖిల ప్రియను నంద్యాల సీటు విషయంలో బాబు ముంచినట్టే కనిపిస్తోంది.

To Top

Send this to a friend