మళ్లీ చలపతి రావు చెత్త వ్యాఖ్యలు

 

 

నాగచైతన్య, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ చిత్రం ఆడియో వేడుకలో నటుడు చలపతి రావు ఆడవారి పట్ల చాలా అసభ్యంగా మాట్లాడిన విషయం తెల్సిందే. ఒక పెద్ద వేడుకలో అలా మాట్లాడటంపై తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మహిళ సంఘాల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. మహిళ సంఘాల వారు చలపతి రావుపై కేసులు కూడా పెట్టారు. దాంతో చలపతి రావు తాను మహిళలను కించపర్చే ఉద్దేశ్యంతో అలా మాట్లాడలేదు అంటూ క్షమాపణలు చెప్పాడు. దాంతో వివాదం సర్థుమణిగింది.

ఇప్పుడు మరో వివాదంలో చలపతి బాబాయి వేలు పెట్టాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చలపతిరావును ఇంటర్వ్యూవర్‌ ప్రశ్నిస్తూ ఇటీవల చీరలు కట్టుకుని పద్దతిగా కనిపించే వారిని కూడా వదలకుండా ఆకతాయిలు వేదిస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి అంటూ ప్రశ్నించగా. చలపతి రావు ఇచ్చిన సమాధానం షాకింగ్‌గా ఉంది.

చలపతి రావు ఆ ప్రశ్నకు సమాధానంగా.. ఈ దేశం స్వాతంత్య్ర దేశం. ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్చ ఉంది. దాంతో వారిని ఏమీ అనడానికి లేదు. వారు ఎంత కామెంట్‌ చేసినా కూడా మనను కాదులే అనుకుని వదిలేస్తే వివాదం ఉండదు. దగ్గరకు వస్తే అప్పుడు అతడిపై కఠినంగా వ్యవహరించాలనేది తన అభిప్రాయంగా చెప్పుకొచ్చాడు. అంటే ఎంత కామెంట్స్‌ చేసినా కూడా నోరు మూసుకుని ఉండాలా అంటూ మహిళ సంఘాల వారు తాజాగా మరోసారి చలపాయి వ్యాఖ్యలపై మండి పడుతున్నారు.

To Top

Send this to a friend