వెంకయ్య పాయే.. చంద్రబాబు దాడి మొదలాయే..

తనకు అడ్డుగా వచ్చే ఎవ్వరినీ నిలదొక్కుకోనీయకుండా చేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ సక్సెస్ అవుతూ వస్తున్నాడు. 70 ఏళ్లు దాటిన వారికి పదవులు లేవు అని అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా లాంటి వాళ్లను ఇప్పటికే మోడీ పక్కనపెట్టేశాడు. ఇప్పుడు బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తూ ఏకుమేకుగా మారిన వెంకయ్యనాయుడును వ్యూహాత్మకంగా ఉచ్చవ విగ్రహం లాంటి ఉపరాష్ట్రపతి పదవికి నామినేట్ చేసేశాడు. ఇలా మర్రిచెట్టు లాంటి మోడీ నీడలో ఎదగాలనుకునే సీనియర్ వెంకయ్య అడ్డును చాకచక్యంగా తొలగించుకున్నాడనే గుసగుసలు ఢిల్లీలో వినిపిస్తున్నాయి..

ఇక ఏపీకి పెద్ద దిక్కు అయిన వెంకయ్య నాయుడు బీజేపీలో కీరోల్ పోస్టు నుంచి వైదొలగడం అందరికంటే ఎక్కువగా మరో నాయుడు చంద్రబాబుకు మింగుడు పడడం లేదు. వెంకయ్య ఉపరాష్ట్రపతిగా పోవడంతో ఇప్పుడు ఏపీ వాణిని, ఏపీకి నిధులను తెచ్చుకోవడం బాబుకు కష్టతరం.. ఇన్నాళ్లు బాబుకు, ఏపీకి వకాల్తా పుచ్చుకొని పనులు చేసిన వెంకయ్య పోవడంతో చంద్రబాబు కూడా మోడీపై గుర్రుగా ఉన్నాడు. మోడీ కావాలనే వెంకయ్యను పార్టీ నుంచి పంపించేశారనే విమర్శలు టీడీపీలో ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే 2019 ఎన్నికల్లో బీజేపీతో, మోడీతో కలిసి సాగడం కంటే తెగతెంపులు చేసుకొని ముందుకెళ్లడమే మంచిదనే అభిప్రాయం టీడీపీలో వ్యక్తమవుతోందట.. అందుకే చంద్రబాబు అనుంగ సలహాదారు, కం స్నేహితుడు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో ఈ విషయంపై చర్చించినట్టు తెలిసింది. రాధాకృష్ణ ఇటీవలే మోడీపై అక్కసు గక్కుతూ ‘‘మోడీ దక్షిణాది డబ్బును ఉత్తరాది ఖర్చు పెడుతున్నాడని.. దక్షిణాదిని మోడీ సవతి పిల్లలను చూసినట్టు’’ చూస్తున్నాడనే రీతిలో కథనం వండి వర్చాడు. అంతేకాదు.. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కొత్త పలుకు శీర్సికలో రాధాకృష్ణ మోడీపై అక్కసు వెళ్లగక్కాడు. ఇందంతా చూస్తుంటే చంద్రబాబు.. మోడీ నుంచి దూరం జరుగుతున్నట్టే కనిపిస్తోంది. మోడీతో కయ్యానికి కాలు దువ్వుతున్నట్టు స్పష్టమవుతోంది.

To Top

Send this to a friend