రాజధాని అమరావతి లో కుల పురాణం…

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రకటన వెలువడిన నాటి నుంచి కుల కంపు మొదలయ్యింది. తన కులస్తులు ఎక్కువ మంది ఉన్న ప్రాంతం కనుక వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికే అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేశారని వైసీపీ నాయకులు ఆరోపించారు.

రాజధాని ప్రాంతం ని CRDA గా ఏర్పాటు చేసిన తరువాత అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అమరావతిలో బలవంతపు సేకరణ చేస్తున్నారని ఆరోపణలు చేయగానే ,టీడీపీ లో నాయకత్వం వహిస్తున్న ఒక సామాజిక వర్గం వారు జగన్మోహన్ రెడ్డిని రాజధాని అమరావతి లో అడుగు పెట్టనివ్వమని బహిరంగంగా ప్రకటించారు. అప్పుడే జగన్మోహన్ రెడ్డికి అమరావతి పై ఒక దురభి ప్రాయం ఏర్పడింది.

జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో గుంటూరు జిల్లా, తెనాలి ప్రాంతంలో ఉన్న నారాకోడూరు,అంగలకుదురు గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి నడిచిన రోడ్డుని టీడీపీ కి చెందిన ఒక సామాజిక వర్గం వారు పసుపు నీళ్లతో కడిగారు.ఆ సంఘటన లు ఆ సామాజిక వర్గం పై జగన్మోహన్ రెడ్డికి కక్ష పూరిత వైఖరి ని కలుగచేసింది.

దానికి తోడు అమరావతి రాజధాని వల్ల జగన్మోహన్ రెడ్డి తన సామాజిక వర్గానికి లాభం లేదని అభిప్రాయానికి వచ్చాడు.

వైసీపీ కి మద్దతుగా ఉండే దళితుల అసైన్ మెంట్ భూములను టీడీపీ రాజకీయ నాయకులు బెదిరించి తక్కువ ధరకు కొనుగోలు చెయ్యడం కూడా దళితులకు అమరావతి లో వ్యతిరేకత పెంచింది.
దళితుల అసైన్ మెంట్ భూములు అతితక్కువ రేట్లకు టీడీపీ వారు కొనుగోలు చేసే దాకా వేచి చూసి, దళితుల చేతుల్లో నుండి తన పార్టీ వారి చేతిలోకి వచ్చిన తరువాత ,ఆ భూములకు మంచి ప్యాకేజీని చంద్రబాబు ప్రకటించాడు.

ఎకరా అసైన్ మెంట్ భూమి 5లక్షల నుండి 20 లక్ష ల రూపాయలకు టీడీపీ నాయకులు కొనుగోలు చేసి, ప్రభుత్వం నుంచి వచ్చిన ప్యాకేజి ప్రకారం తమ భూములు విలువ సుమారు 2 కోట్ల రూపాయల విలువ కు పెంచుకోగలిగారు.ఆ విధంగా నష్టపోయిన దళితులకు తీవ్రమైన ఆగ్రహావేశాలు కలిగాయి.

దళితుల్లో ఆ విధంగా చెలరేగిన ఆగ్రహం
చల్లార్చడానికి అమరావతి లో 120 అడుగుల బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

ఐతే దళితుల ఆగ్రహం ఎంత మాత్రం చల్లారలేదు. వారి ఆగ్రహాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి,
భవిష్యత్తు లో అమరావతి ని నిర్వీర్యం చేసే వ్యూహం లో భాగంగా రాజధాని అమరావతి వాస్తవ్యుడు ,అప్పటి టీడీపీ ప్రభుత్వం పై దళితుల భూముల విషయంలో పోరాడుతున్న నందిగం సురేష్ ని బాపట్ల నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడు గా పోటీకి నిలబెట్టారు.

ఇప్పుడు పలువురు దళితులకు అమరావతి రాజధాని లో ఇండ్ల స్థలాలు ఉచితంగా ఇవ్వాలనే నిర్ణయం కూడా దళితులకు, టీడీపీ లో నాయకత్వం వహిస్తున్న సామాజిక వర్గానికి మధ్య తగాదాలు రెచ్చగొట్టడానికే.
ఆ తగాదాలు మరింత హింసాత్మకముగా మారితే ఆ ప్రాంతం ప్రజలపై SC,ST అట్రాసిటీ కేసులు నమోదు చేసి అమరావతి లో జరుగుతున్న ఉద్యమం చల్లార్చే వ్యూహమేమో అనిపిస్తున్నది.

అమరావతి రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ కాపిటల్ గా నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వ వాటా భూమి మొత్తం బీదలకు పంపిణీ చేస్తారు.భూములు అమ్మి నిధులు సమకూర్చుకోవడానికి భవిష్యత్తు లో వచ్చే ప్రభుత్వానికి కూడా ఇక సాధ్యం కాదు.

భవిష్యత్తు లో అమరావతి ప్రాంతంలో అలజడులు, కులాల కుమ్ములాటలు ముదిరిపోయి నాశనం అవుతుంది అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు.
వైసీపీ ,టీడీపీ ల సామాజిక కుట్రలు,కుతంత్రాలకు అమరావతి ప్రాంతంలో ఉన్న, ఏ తప్పు చేయని అనేక మిగిలిన సామాజిక వర్గాలు నలిగిపోతున్నాయి. 😢

ఇదండీ అమరావతి లో నిన్న, నేటి,రేపటి కుల పురాణం.
విశ్లేషణ :
జెట్టి శ్రీ మారుతీ కుమార్

To Top

Send this to a friend