చిరు సినిమాకు కుల పట్టింపులు!

కులము.. కులమూ అంటూ వ్యర్థవాదములెందుకు అని ఎన్టీఆర్ ఓ పౌరాణిక చిత్రాల్లో కులజాఢ్యాన్ని కడిగేశాడు. అయినా కూడా ఇప్పటికీ ఈ కుల జాఢ్యం పోవడం లేదు. రాజకీయాలు, సినిమాల్లో అగ్రకుల పెత్తనమే కొనసాగుతోంది. వారి వారి కులాలకే అగ్ర తాంబూలం దక్కుతోంది.. చిరంజీవి మంచి ఆశయంతో .. స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రను తెరపై చూపించాలని ప్లాన్ చేస్తున్నారు. దానికి కుల పట్టింపులు అధికమయ్యాయట..

భారత దేశంలో తొలి స్వాతంత్ర్య సంగ్రామానికి ముందే తెలుగు రాష్ట్రాల్లోని నల్లమల కేంద్రంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాంతంత్రోద్యమం లేవదీసి బ్రిటీష్ వారిని ఎదుర్కొన్నారు. ఆ తొలి స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రను దేశవ్యాప్తంగా తీసి సత్తా చాటాలని చిరు ఉవ్విళ్లూరుతున్నారు. కానీ చిరు సినిమాకు సైతం కులాల పట్టింపులు ఎక్కువయ్యాయట..

చిరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా హైప్ పెరుగుతోంది. ఇప్పుడు ఈ సినిమాకు రెడ్డి వర్గం వారి నుంచి చిరు కు గట్టిసపోర్ట్ లభిస్తోందట.. సినిమా ఫస్ట్ లుక్, పోస్టర్ లను రెడ్డి సంఘాలు, నాయకులు ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని తెలిసింది. ముఖ్యంగా రాయలసీమలో ఎక్కువ సంఖ్యలో ఉన్న రెడ్డి సామాజిక వర్గ నేతలు చిరు సినిమాను తమ భుజస్కంధాలపై మోసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం. ఇందుకోసం పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యారట.. ఈ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించడంతో ఈ కుల పట్టింపులు చిరంజీవి తెలిసియాట.. ఉయ్యాలవాడ సినిమాను ఒక కులానికి ఆపాదించడం మానాలని ఇది ఓ దేశభక్తి సినిమా అని చిరు స్పష్టం చేశారట..

To Top

Send this to a friend