‘చెప్పాను బ్రదర్‌’.. పవన్‌ ఫ్యాన్స్‌తో బన్నీ


అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన ‘డీజే’ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం నిన్న శిల్ప కళావేదికలో వైభవంగా జరిగింది. ఎప్పటిలాగే ఆడియో వేడుకలో పవన్‌ ఫ్యాన్స్‌ సందడి చాలా ఎక్కువ అయ్యింది. ఏ ఒక్కరు మాట్లాడుతున్నా కూడా పవన్‌ అటూ ఫ్యాన్స్‌ అరవడం మొదలు పెట్టారు. ముఖ్యంగా బన్నీ మాట్లాడటం ప్రారంభం అయ్యిందో లేదో వెంటనే పవన్‌ అంటూ గట్టిగా మొత్తుకున్నారు.

గతంలో పవన్‌ గురించి చెప్పను బ్రదర్‌ అంటూ ఫ్యాన్స్‌కు తలబిరుసు సమాధానం ఇచ్చిన బన్నీ ఆ తర్వాత తాను చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసుకున్నాడు. అందుకే పలు వేదికల మీద ఇప్పటికే పవన్‌ గురించి మాట్లాడటం జరిగింది. తాజాగా ఈ వేడుకలో కూడా పవన్‌ పేరు ఎత్తి బన్నీ మేమంత మెగా హీరోలం అంటూ చాటి చెప్పే ప్రయత్నం చేశాడు.

అంత చెప్పినా కూడా బన్నీ మాట్లాడుతున్న సమయంలో పవన్‌ ఫ్యాన్స్‌ మొత్తుకుంటున్న నేపథ్యంలో ‘చెప్పాను బ్రదర్‌’ అంటూ పవన్‌ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి అనడం జరిగింది. దానికి పవన్‌ ఫ్యాన్స్‌ కాస్త సైలెంట్‌ అయ్యారు. మొత్తానికి చెప్పను బ్రదర్‌ వివాదానికి చెప్పాను బ్రదర్‌ అని చెప్పి ఫుల్‌ స్టాప్‌ పెట్టడం జరిగింది. ఇకపై అయినా బన్నీని పవన్‌ ఫ్యాన్స్‌ ఆధరిస్తారేమో చూడాలి.

To Top

Send this to a friend