బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్టా.?


మీరు ఇంట్లో వైర్ తో కూడిన బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ వాడాలనుకుంటున్నారా.? అయితే బీఎస్ఎన్ఎల్ సంస్థ అదిరిపోయే ఆఫర్ ను తీసుకొచ్చింది. ప్రభుత్వ రంగంలోని బీఎస్ఎన్ఎల్ ఈ మేరకు ప్రకటన చేసింది..

ఎక్స్ పీరియన్స్ అన్ లిమిటెడ్ బీబీ 249 పేరుతో సరికొత్త ప్లాన్ ను బ్రాడ్ బాండ్ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఈ పథకంలో వినియోగదారులు అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు.. అలాగే రోజుకు 10 జీబీ డేటా ఉచితంగా ఇచ్చే సదుపాయాన్ని కల్పించింది. నెలరోజుల కాలపరిమితితో ఈ సేవలు అందుతాయి. ఇప్పుడున్న అన్ని బ్రాడ్ బాండ్ లలో ఇదే చీపెస్ట్ ప్లాన్ అని నిపుణులు చెబుతున్నారు. 2 ఎంపీపీఎస్ వేగం.. ఉచిత ఇన్ స్టాలేషన్ సదుపాయాన్ని కూడా బీఎస్ఎన్ఎల్ కల్పించింది..
దేశంలో రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో అన్ని టెలికాం దిగ్గజాలు కుదేలవుతున్నాయి. ఎయిల్ టెల్, ఐడియా, వోడాఫోన్లే తట్టుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో నష్టాల్లో కూరుకుపోతున్న బీఎస్ఎన్ఎల్ సంస్థ ను లాభాల్లోకి తెచ్చేందుకు ఇలా పథకాలు, ఆఫర్లు ప్రకటిస్తున్నారు. కానీ కస్టమర్ల నుంచే ఆశించిన స్పందన రావడం లేదు. ఎందుకంటే సరైన నెట్ వర్క్, ఇంటర్నెట్ వేగం లేకపోవడంతో వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ ను ఎంచుకునేందుకు వెనుకాడుతున్నారు.

To Top

Send this to a friend