నంద్యాలపై బీజేపీ సీక్రెట్ సర్వే.. గెలుపెవరిదంటే..?

2019 ఎన్నికలకు ప్రీ ఫైనల్ గా భావించే నంద్యాల ఉప ఎన్నిక ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎన్నికల్లో గెలవడానికి అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. టీడీపీ సినీ గ్లామర్ ను కూడా నంద్యాల ఎన్నికల్లో జోడించింది. టీడీపీ తరఫున బాలక్రిష్ణ, వేణుమాధవ్ లతో కూడా ప్రచారం చేశారు. ఇక వైసీపీ అధినేత జగన్, ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా ఇంటింటికి తిరుగుతూ వైసీపీ గెలుపు బాధ్యతను భూజానా వేసుకున్నారు.

నంద్యాల ఉప ఎన్నిక వేడి రగిలిపోతుండగా బీజేపీ కూడా దీనిపై దృష్టి సారించింది. బీజేపీ ప్రభుత్వం నంద్యాలలో సీక్రెట్ గా ఇంటెలిజెన్స్ సాయంతో సర్వే నిర్వహించిందట.. ఇందులో ఏ పార్టీ గెలుస్తుందో.. వచ్చే 2019 ఎన్నికల్లో ఎవరికీ మెజార్టీ ఉంటుందో తేటతెల్లమైంది. ఆ ప్రకారం వచ్చే ఎన్నికల్లో అదే పార్టీతో కలిసి ముందుకు వెళ్లాలని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నట్టు సమాచారం.

నంద్యాల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీసం 6వేల ఓట్ల మెజార్టీ దక్కే అవకాశం ఉందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ తేల్చినట్టు వార్తలు వస్తున్నాయి. నంద్యాలలో పోటాపోటీ వాతావరణంలో అతికష్టం మీద వైసీపీనే గెలుస్తుందని సర్వే తేల్చినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సర్వే ఫలితాలు తెలుగుదేశం పార్టీకి మింగుడపడడం లేదు. రెండున్నర నెలల నుంచి నంద్యాలలో మకాం వేసి చేసినా ఓటమి ఎదురుకాబోతుందా అన్న అనుమానాలు టీడీపీలో మొదలయ్యాయట.. సర్వే రిపోర్టు బయటపడడంతో 2019 ఎన్నికల్లో కూడా టీడీపీకి ఓటమి తప్పదా అన్న భావన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోందట..

To Top

Send this to a friend