బీజేపీ.. ఓ రామసేతు.., రామమందిరం..


ఎవరొస్తే వారి ఎజెండా.. ప్రజల మనోభావాలు అక్కర్లేదు. వారి ఆశలు ఆకాంక్షలు పట్టవు.. దేశంలోనే ఎత్తైన జాతీయ జెండాను కేసీఆర్ నిలబెడతాడు.. దాన్ని చూసి పంజాబ్ లో అంతకంటే ఎక్కువదే స్థాపిస్తారు.. ముంబైలో 3 వేల కోట్ల తో సముద్రంలో శివాజీ భారీ విగ్రహం.. గుజరాత్ లో సర్దార్ పటేల్ భారీ విగ్రహాలు.. ఇలా ఎవరి పార్టీలు గద్దెనెక్కితే వారి అభిమాన ఆరాధ్యుల విగ్రహాలు రూపుదిద్దుకుంటాయి. ఇందులో జనాలు కష్టపడి సంపాదించిన సొమ్మును కనీసం వారి అనుమతి అడగకుండా.. రెఫరెండం తీసుకోకుండా ఖర్చు చేసే హక్కు ఈ పాలకులకు ఎక్కడిది అని గట్టిగా అనాలని అందరికీ ఉంటుంది. అడిగినోళ్లను మీకు దేశభక్తి లేదు అని తిట్టిపోస్తారు. అందుకే ‘మేమేందుకు దేశద్రోహులం కావాలని’ ఇలా ప్రజాసొమ్ము వృథాగా శిలలుగా మారుతున్నా కిమ్మనకుండా సైలెంట్ అవుతున్నారు..

హిందుత్వ బీజేపీ దేశంలో, యూపీలో పలు రాష్ట్రాల్లో గద్దెనెక్కగానే రాజకీయాలు, వారి పరిపాలన తీరు మారిపోతోంది. హిందుత్వ ఎజెండా ముందుకొస్తోంది.. కాలగర్భంలో విశిష్టతగా మారిన అయోధ్యలో రామమందిరం.. తమిళ నాడు -శ్రీలంకల మధ్యనున్న రామసేతు ప్రాజెక్టులకు మళ్లీ బీజేపీ ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తోంది. రామసేతు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిందా లేదా మానవ నిర్మాణమా అన్న అంశాన్ని తెలుసుకోవడానికి తాము స్వతంత్ర్య సర్వే నిర్వహించాలనుకుంటున్నామని భారత చారిత్రక పరిశోధన మండలి, కేంద్రం ప్రకటించిడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

బీజేపీ రామసేతు నిర్మాణాన్ని పునరుద్ధరిస్తే వేలకోట్లు కావాలి.సముద్రంలో దాన్ని కనుగొనడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఒకవేళ హిందువుల మనోభావాలకు అనుగుణంగా అక్కడ రామసేతు ఉన్నట్టు తేలితే దీన్నో సాకుగా.. ఓటు బ్యాంకుగా మళ్లీ రామసేతు నిర్మాణం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ లెక్కన వేల కోట్లు ఖర్చు చేసినా భక్తి మాయలో ఎవ్వరూ నోరుమెదపరు.. సో ఇలా పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, అభివృద్ధి పక్కకు పోయి సెంటిమెంటు యాంటిమెంటుగా మారి ప్రజాధనం వృథా అయిపోతుందన్నమాట..

To Top

Send this to a friend