కాజల్‌కు మంత్రి బర్త్‌డే కానుక


టాలీవుడ్‌లో దాదాపు స్టార్‌ హీరోల అందరితో నటించిన ముద్దుగుమ్మ కాజల్‌ తాజాగా ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో 50 చిత్రాలను పూర్తి చేసుకుంది. మొదటి చిత్రాన్ని తేజా దర్శకత్వంలో చేసిన కాజల్‌ ఇప్పుడు మళ్లీ 50వ సినిమాను కూడా తేజ దర్శకత్వంలోచేయడం చెప్పుకోదగ్గ విషయం. ఇక నేడు కాజల్‌ బర్త్‌డే. ఈ సందర్బంగా ఈ అమ్మడు మీడియాతో మాట్లాడటం జరిగింది. తనకు ఈ బర్త్‌డే చాలా ప్రత్యేకం అని చెప్పుకొచ్చింది.

కాజల్‌ మాట్లాడుతూ.. ఈ బర్త్‌డేకు ‘నేనేరాజు నేనేమంత్రి’ చిత్రం పెద్ద గిఫ్ట్‌ అని చెప్పుకొచ్చింది. నా 50 సినిమా ‘నేనే మంత్రి నేనే రాజు’ అవ్వడంతో పాటు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ఈ సంవత్సరం బర్త్‌డే గిఫ్ట్‌ రానాతో సినిమా చేయడమే అంటూ ఆమె పేర్కొంది. పూర్తి విభిన్నమైన పాత్రలో కాజల్‌ ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాను అతి త్వరలోనే విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు ప్లాన్‌ చేస్తున్నారు. గత కొంత కాలంగా కాజల్‌కు కాస్త క్రేజ్‌ తగ్గింది. మళ్లీ ఈ సినిమాతో కాజల్‌ మునుపటి క్రేజ్‌ను దక్కించుకుంటుందేమో చూడాలి. మరో వైపు కాజల్‌ నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్‌తో ‘ఎమ్మెల్యే’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.

To Top

Send this to a friend