దీక్షను ఎత్తుకెళ్లిన ఆదర్శ్ , ప్రిన్స్

బిగ్ బాస్ మరో వివాదానికి కేరాఫ్ అడ్రస్ అయ్యింది. నిన్న బిగ్ బాస్ లోని సెలబ్రెటీలకు ఇచ్చిన లగ్జరీ బడ్జెట్ టాస్క్ శృతిమించింది. లగ్జరీ హోటల్ లో అతిథులుగా నవదీప్, దీక్ష వ్యవహరించగా.. ప్రిన్స్ మేనేజర్ గా మిగతా వారు సర్వర్ లు, వంటమనుషులుగా వారికి సేవలందించారు.

ఇందులో నవదీప్, దీక్షలు వారితో సాంతం పనులు చేయించుకున్నారు. అందరీనీ తీవ్రంగా హింసించి సేవలు చేసుకోవాలని అలా అయితేనే మీ ఇద్దరినీ వచ్చేవారం ఎలిమినేషన్ నుంచి తప్పిస్తామని బిగ్ బాస్ నవదీప్, దీక్షలకు హామీ ఇస్తాడు. దీంతో వారిద్దరు రెచ్చిపోయి మిగతా కంటెస్టెంట్లకు చుక్కలు చూపిస్తూ సేవలు చేయించుకుంటారు. ఒకనొక దశలో దీక్ష తన చంకలోని వెంట్రుకలను ఆదర్ష్ తో తీయించుకోవడం వివాదాస్పదమైంది. ఆదర్ష్ మధ్యలోనే ఈ పనిచేయకుండా వెళ్లిపోయారు.

శివబాలాజీతో దీక్ష తన తొడలు మసాజ్ చేయించుకోవడం కూడా వివాదాస్పదం అయ్యింది. ఇక బిగ్ బాస్ ఆదేశాల మేరకు ప్రతీకారం కాన్సెప్ట్ లో నవదీప్, దీక్షలపై మిగతా సెలబ్రెటీలు ప్రతీకారం తీర్చుకున్నారు. దీక్ష, నవదీప్ ను స్టోర్ రూం లో పెట్టి తాళం వేయాలని చెప్పగా.. దీక్షను ఆదర్ష్, ప్రిన్స్ కలిసి ఎత్తుకొని పోయి స్టోర్ రూంలో పడేశారు. ఇదేదో రేప్ సీన్ లాగా ప్రేక్షకులకు కనిపించింది. ఈ సంఘటన మధ్యలో గలాట జరిగింది. దీక్ష తీవ్రంగా ఇబ్బందిపడింది.. నవదీప్, దీక్షలకు మిగతా సభ్యులకు ఈ విషయంలో చిన్నపాటి గొడవ జరిగింది. ఆదర్ష్, ప్రిన్స్ .. వ్యవహరించిన తీరు మాత్రం విమర్శలపాలైంది.

To Top

Send this to a friend