బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.?

బిగ్ బాస్ షోలో 71 రోజులు ఉండబోతున్న సెలబ్రెటీలకు షోలో పాల్గొంటున్నందుకు ఒక్కొక్కరికి 5-7.5 లక్షలు ఇస్తున్న సంగతి తెలిసిందే.. అయితే బిగ్ బాస్ హౌస్ లో చివరి వరకు ఉండే విజేతకు ఎంత ఇస్తారనేది అటు మాటీవీ యాజమాన్యం కానీ ఇటు బిగ్ బాస్ కానీ ఇప్పటివరకు తెలుపలేదు. అయితే శని, ఆదివారాల్లో ఎన్టీఆర్ ఈ విషయాన్ని చెప్పేశాడు. రోజురోజుకు బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్లతో తగ్గిపోతున్న ఉత్సాహాన్ని, ఆట స్పూర్తిని పెంచేందుకు బిగ్ బాస్ హౌస్ లో ఎవరైతే 71 రోజులుండి గెలుస్తారో వారికి ఏకంగా భారీ మొత్తం ముట్టజెప్పుతామని ప్రకటించారు.

ఈ ప్రకటన ద్వారా ఇటు ఆడియన్స్ లో ఆసక్తి పెంచడంతో పాటు అటు షో లో పాల్గొన్న పోటీదారుల్లో గేమ్ మరింత కసిగా ఆడాలనే ఉత్సాహాన్ని ఎన్టీఆర్ క్యాష్ ప్రకటనతో నింపాడు. ఎన్టీఆర్
బిగ్ బాస్ షో విజేతకు రూ.50లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్టు వేదికపై ప్రకటించారు. ఈ ప్రకటన రాగానే పోటీదారుల్లో ఎక్కడి లేని ఉత్సాహం వచ్చేసింది. అంతేకాదు .. ఈ 50లక్షలు గెలిస్తే ఎవరెవరు ఏం చేస్తారో చెప్పాలని ఎన్టీఆర్ కోరగా .. మెజార్టీ పీపుల్ అమ్మకిస్తామని.. బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు.

ఇక రానా హౌస్ మేట్స్ తో ఓ గంటపాటు లోపలికి వెళ్లి వారితో సరదాగా గడిపారు. అంతేకాదు.. ఈ వారం ఎలిమినేషన్ లో మొత్తం ఆరుగురిలోంచి ఒకరు ఎలిమినేట్ అయ్యారు. ధన్ రాజ్, మహేశ్ కత్తి, శివబాలాజీ, ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా సేఫ్ జోన్లోకి పోగా.. మిగిలిన ముగ్గురులో కల్పన, సమీర్, ముమైత్ ఖాన్ లో ఈ వారం సమీర్ ఎలిమినేట్ అయిపోయాడు. ఇక చివర్లో రానాను బిగ్ బాస్ ఇంటిలోనే మొత్తం కంటెస్టెంట్లలో ఎవరు రూ.50లక్షలు గెలుస్తారో వారి మెంటాల్టీ బట్టి చెప్పాలని ఎన్టీఆర్ కోరగా.. రానా చెప్పిన మొదటి పేరు ధన్ రాజ్. ధన్ రాజ్ లో ఆ కాన్ఫిడెంట్ బాగా ఉందని చెప్పాడు. ఆ తర్వాత రేసులో శివబాలాజీ, హరితేజ గెలవచ్చని చెప్పాడు. సో ఆ 50లక్షలు ధనరాజ్, శివబాలాజీ, హరితేజ ఈ ముగ్గురిలో ఒకరు గెలవడం ఖాయమని తేలిపోయింది. ఇలా ప్రైజమనీ ప్రకటించడం సమీర్ ఎలిమినేట్ అవ్వడం.. రానా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి అలరించడం ఆదివారం జరిగిన విశేషాలు..

To Top

Send this to a friend