ఏడుపులతో బోర్ కొట్టిస్తున్నారు..

బిగ్ బాస్ హౌస్ లో నిన్న రాత్రి జరిగిన షోలోనూ ఏడుపు కొనసాగింది. కానీ ఆసక్తికరంగా బిగ్ బాస్ మిమ్మల్ని బాధపెట్టిన వారెవరో అందరి సమక్షంలో చెప్పాలని నిన్న టాస్క్ లో భాగంగా కోరడంతో అందరూ రెచ్చిపోయారు.. ముఖ్యంగా కెప్టెన్ గా ఉన్న సింగర్ కల్పన తీరును ధన్ రాజ్, ప్రిన్స్, సమీర్ లు కడిగిపారేశారు..కల్పన టాయిలెట్ క్లీన్ నుంచి బెడ్ షీట్లు, చెప్పులు, దుమ్ము ధూళి సహా చిన్న చిన్నవిషయాలకే రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు.

కెప్టెన్ కాకముందు అందరికీ గోరుముద్దలు తినిపించిన కల్పన.. ఇప్పుడు కెప్టెన్ గా మారాక నియంతలా మారిపోయిందని ధన్ రాజ్ సహా మిగతా కంటెస్టెంట్ లు విమర్శలు చేశారు. దీనికి కల్పన వివరణ ఇచ్చినా గానీ ఆమె మాత్రం నొచ్చుకుంది. ఇక ధన్ రాజ్ తన బాధను వెళ్లగక్కాడు . ‘‘తనను పాలిటిక్స్ చేస్తున్నావని.. నక్క అని తిట్టిన’’ సమీర్ విమర్శలను గుర్తు చేస్తూ తాను 15 నిమిషాల పాటు ఆ మాటలకు బాత్రూంలో ఏడ్చేసానని.. 5 సంవత్సరాల తర్వాత సమీర్ వల్లే తాను ఏడ్చేసానని వాపోయారు.

వీళ్లే కాదు.. నిన్నటి బిగ్ బాస్ లో నటి ముమైత్ ఖాన్ కూడా ఏడుపు లఖించింది. ఇక షోలోని అందరూ తనను వేలెత్తి చూపడంతో కెప్టెన్ కల్పన .. ధన్ రాజ్ ను పట్టుకొని తాను వెళ్లిపోతా ఇక్కడ ఉండలేను అంటూ బోరుమంది.. ఇలా బిగ్ బాస్ హౌస్ లోని బుధవారం రాత్రి ఏపిసోడ్ మాత్రం ఏడుపులు, పెడబొబ్బలతో నిండిపోయింది..

To Top

Send this to a friend