బిగ్ బాస్ లో డబుల్ షాకింగ్..

బిగ్ బాస్ ఆసక్తి రేపింది. శని ఆదివారాలు ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. కొత్తగా శివబాలాజీ ఇంటికెప్టెన్ గా నియమితులయ్యారు.
బిగ్ బాస్ రసకందాయంలో పడింది. శని, ఆదివారాల్లో ఎన్టీఆర్ రావడంతోపాటు బిగ్ బాస్ కంటెస్టెంట్లతో కలిసి షోను రక్తికట్టించారు. ఈ సందర్భంగా ఆశ్చర్యకరంగా ఎలిమినేషన్ ప్రక్రియ కొంత పుంతలు తొక్కింది.

ఇక డబుల్ ధమాకా పేరుతో ఎన్టీఆర్ సెలబ్రెటీలకు డబుల్ షాక్ ఇచ్చాడు. ఈ వారం ఇద్దరినీ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ చేసి సంచలనం సృష్టించాడు.. నిజానికి ప్రేక్షకుల ఓటింగ్ మేరకు శనివారం బిగ్ బాస్ హౌస్ నుంచి మహేశ్ కత్తి ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత ఆయన బయటకు రావడంతో బిగ్ బాస్ పై ఒక పుస్తకం రాస్తానని.. అందరి బండారం అందులో బయటపెడతానని హెచ్చరికలు పంపారు. ఇక ఎన్టీఆర్ కూడా తన పై కొంత పుస్తకంలో మంచిగా రాయండని మహేశ్ కత్తిని రిక్వెస్ట్ చేశాడు.

ఇక ఆదివారం ఆశ్చర్యకరంగా రెండో సెలబ్రెటీ కల్పన బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం సంచలనమైంది. శని, ఆదివారాలు రెండు రోజులు ఇద్దరు ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్లందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇక కల్పన బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక ఒక్కొక్కరి గురించి పాటలు పాడుతూ వారి వ్యక్తిత్వాన్ని వెల్లడించిన తీరు నవ్వులు పూయించింది. ఎన్టీఆర్, ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వేశారు. కల్పన ఇంత పర్ ఫామెన్స్ చూస్తే మళ్లీ బిగ్ బాస్ లోకి పంపించాలని ఉందని.. ఆమె లోపల కామ్ గా.. బయట చంద్రముఖిలా రెచ్చపోవడంతో జనాలకు పసందు దొరికింది ఆదివారం మొత్తం కల్పన స్టేజ్ ఫర్ ఫామెన్స్ తోనే బిగ్ బాస్ షో రక్తికట్టించింది.

To Top

Send this to a friend