రాంచరణ్ కు పరీక్ష.. పాస్ అవుతాడా.?

ఆయనో లెక్కల మాస్టర్.. మాస్టర్ పదవి వదిలి దర్శకత్వం వహించారు. ఎంతో క్రియేటివిటీ డైరెక్టర్ గా పేరుగాంచిన సుకుమార్ తో సినిమాలు చేయడానికి అగ్రహీరోలందరూ ఆసక్తి చూపుతారు. ఎందుకంటే సుకుమార్ లో బోలెడంతా క్రియేటివిటీ ఉంటుంది. ఆయన సినిమాల్లో అది ప్రతిధ్వనిస్తుంది. దిగ్గజ రాజమౌళి సైతం తన మర్యాద రామన్న సినిమాలో సుకుమార్ తీసిన ఆర్య సినిమాలోని సీన్ ను కాపీ కొట్టారంటే అర్థం చేసుకోవచ్చు..

రాంచరణ్… మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోకు ఇప్పటివరకు నటనకు ప్రాధాన్యమున్న పాత్ర దక్కలేదు. మగధీర వచ్చినా అది రాజమౌళి ఖాతాలోకే వెళ్లింది. ఎంట్రీతోనే మాస్ హీరోగా పేరుతెచ్చుకున్న రాంచరణ్ కు ఇప్పుడు నటుడిగా నిరూపించుకునే అవకాశం దక్కింది. మరి ఈ మెగా వారసుడు తండ్రిలా యాక్టింగ్ లో నూటికి నూరు మార్కులు తెచ్చుకుంటాడా.? లేదా అన్నది ఆసక్తిగా మారింది.

మూస కథలకు దూరంగా క్రియేటివిటీతో వినూత్న కథలతో సినిమాలు తీసే సుకుమార్ ఈసారి కూడా అదే ప్రయత్నంలో ఉన్నాడు. 1985ల నాటి పల్లెటూరి మూగ, చెవిటి అబ్బాయి రంగస్థలంపై ఎలా నిలదొక్కుకున్నాడనే కథాంశంతో 30 ఏళ్ల కిందటి పరిస్థితులపై సినిమా తీస్తున్నారు. ఇందులో హీరో రాంచరణ్..  నటనకు ఎంతో ప్రాధాన్యమున్న పాత్ర. ఇందులో రాంచరణ్ ఎలా నటిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే ఈ సినిమా కోసం భారీగా గడ్డం పెంచి .. లుంగీ కట్టుకొని అచ్చు తెలుగు పల్లెటూరి పోరగాడుగా మారిన రాంచరణ్ హవభావాలు, నటన విషయంలో ఎంతో శ్రమకోరుస్తున్నాడట.. అవుట్ పుట్ వచ్చాక కానీ నటనలో రాంచరణ్ హిట్ అయ్యాడా.? ప్లాప్ అయ్యాడా అని తేలేది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ పాత్రను రాంచరణ్ ఎలా పండిస్తారన్నది ఉత్కంఠగా మారింది. ఈ పాత్ర రాంచరణ్ కు పరీక్షే అంటున్నారు సినీ విశ్లేషకులు..

To Top

Send this to a friend