ప్రభాస్‌ గురించి అతి పెద్ద ఫేక్‌ న్యూస్‌


యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రస్తుతం ‘సాహో’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఇంకా ‘సాహో’ చిత్ర షూటింగ్‌లో ప్రారంభం పాల్గొంటున్నది లేదు. త్వరలోనే షూటింగ్‌లో ప్రభాస్‌ జాయిన్‌ కాబోతున్నాడు. అప్పుడే ప్రభాస్‌ తర్వాత సినిమా గురించి వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. బాలీవుడ్‌ మీడియాలో ప్రభాస్‌ తర్వాత సినిమా గురించి ఒక ఆసక్తికర కథనం ప్రసారం అయ్యింది. దాంతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా అంతా కూడా ప్రభాస్‌ గురించి చర్చించుకోవడం జరిగింది.

ఇంతకు ఆ ప్రాజెక్ట్‌ ఏంటి అంటే సల్మాన్‌ ఖాన్‌తో ప్రభాస్‌ మల్టీస్టారర్‌ చిత్రం. ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్‌, ప్రభాస్‌ల మల్టీస్టారర్‌ చిత్రం తెరకెక్కబోతుంది అనేది ఆ వార్త సారాంశం. హిందీ మీడియాలో మొదలైన ఈ వార్త తెలుగులో తారా స్థాయిలో ప్రసారం అయ్యింది. రెండు రోజులుగా పతాక స్థాయిలో ఈ వార్తకు ప్రాముఖ్యత లభించడంతో దర్శకుడు రోహిత్‌ శెట్టి స్వయంగా స్పందించాడు.

సల్మాన్‌ ఖాన్‌, ప్రభాస్‌ల కాంబినేషన్‌లో తాను మల్టీస్టారర్‌ చిత్రం చేయబోతున్నట్లుగా మీడియాలో వస్తున్న వార్తలు పచ్చి అబద్దం అని, తాను ఆ ప్రాజెక్ట్‌ గురించి ఆలోచించలేదు అంటూ దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. దాంతో మీడియాలో వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడ్డట్లయ్యింది. ఇప్పటి వరకు ప్రభాస్‌ గురించి ఎన్నో పుకార్లు వచ్చాయి. కాని ఇదే అతి పెద్ద పుకారుగా చెప్పుకోవచ్చు.

To Top

Send this to a friend