ప్రేక్షకులపై పెను భారం


దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దం అయ్యింది. జూన్‌ 30వ తారీకు అర్థరాత్రి జీఎస్టీ పన్ను విధానంను తీసుకు వచ్చేందుకు కేంద్రం సర్వం సిద్దం చేసింది. జీఎస్టీ వల్ల పలు విభాగాల్లో పెను మార్పులు వస్తాయని మొదటి నుండి కూడా ఆర్థిక రంగ నిపుణులు చెబుతూ వస్తున్నారు. జీఎస్టీ అమలులోకి రాకుండానే తెలుగు ప్రజలపై భారంను తెలంగాణ ప్రభుత్వం వేసింది. తెలంగాణలో భారీగా సినిమా హాల్స్‌ టికెట్ల రేట్లను పెంచేందుకు అనుమతిని ఇచ్చింది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఏ క్లాస్‌ థియేటర్లలో 120 రూపాయలకు టికెట్‌ రేటును పెంచడం జరిగింది. ఇక లోయర్‌ క్లాస్‌ టికెట్‌ రేటును 40 రూపాయలకు పెంచారు. ఇక మున్సిపాలిటీల్లో బాల్కనీ టికెట్ల రేటును ఇప్పటి వరకు 50 లేదా 60 రూపాయలుగా ఉండేది. ఇకపై 80 రూపాయలను థియేటర్ల యాజమాన్యం వసూళ్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక లోయర్‌ క్లాస్‌ టికెట్ల రేట్లను కూడా 30 రూపాయలకు పెంచేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇక గ్రామ పంచాయితిల్లో ఉన్న థియేటర్ల టికెట్ల రేట్లు 70 రూపాయలకు పెంచేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. లోయర్‌ క్లాస్‌ టికెట్ల రేట్లు 10 నుండి 20 రూపాయలకు పెరిగింది.

To Top

Send this to a friend