‘భవంతి 108’

నలుగురు జంటలు అడవిలో దారితప్పి ఓ ఆసుపత్రికి వెళ్ళిన నేపథ్యంలో సాగే కథతో ‘భవంతి 108’ చిత్రం రూపొందింది. తోట కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎన్‌. పద్మిని, వి. వెంకటేశ్వరరావు నిర్మించారు. సోమవారంనాడు ఫిలింఛాంబర్‌లో ట్రైలర్‌ ప్రదర్శన జరిగింది. అనంతరం చిత్ర సమర్పకులు ఎస్‌విఎన్‌. రావు మాట్లాడుతూ… కథ ప్రకారం మెదక్‌, గూడూరు ప్రాంతాల్లో చిత్రించాం. కొత్తవారైనా నటీనటులు బాగా నటించారు. ఆసుపత్రిలో దెయ్యాల్లా వుండే మనుషులు ఏం చేశారనేది ఆసక్తికరం. దర్శకుడు కృష్ణ చక్కగా తెరకెక్కించారు. ఈనెల 26న సినిమాను విడుదల చేయనున్నామని తెలిపారు.

సత్యారెడ్డి మాట్లాడుతూ… ట్రైలర్‌ క్వాలిటీగా వుంది. ఈ చిత్రాన్ని 50 థియేటర్లలో విడుదలచేయడం తొలి విజయంగా భావిస్తున్నాం. త్వరలో ఇతర భాషల్లోనూ విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలున్నారని తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ… చిత్రంలోని క్లెమాక్స్‌ హైలైట్‌గా వుంటుంది. నాయిక అశ్లేష మాంత్రికుడి బారినుంచి ఎలా తప్పించుకున్నదనేది కథ సారాంశం. సిజి ఎఫెక్ట్స్‌ చిత్రానికి మరో ఆకర్షణగా వుంటాయని తెలిపారు.

ఇందులో నటించిన అశ్లేష, శిరీష, పావని, మేఘన, సంజయ్‌ మాట్లాడుతూ… చిత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

To Top

Send this to a friend