భరత్‌ వల్లే ఈ స్థాయికి.. రవితేజ?

ప్రస్తుతం టాలీవుడ్‌లో రవితేజ ఒక స్టార్‌ హీరో. ఇదే రవితేజ కెరీర్‌ ఆరంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సహాయ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన రవితేజకు చాలా కష్టాు పడ్డ తర్వాత కాలం కలిసి వచ్చింది. ఇక ఇండస్ట్రీలో అవకాశాలు రావు, వెళ్లి పోదాం అనుకున్న సమయంలో మెల్ల మెల్లగా అవకాశాలు రావడం ప్రారంభం అయ్యింది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే రవితేజ కంటే భరత్‌ చిన్న వాడు అయినా కూడా ప్రేమించి రవితేజ కంటే భరత్‌ ముందుగానే పెళ్లి చేసుకున్నాడు.

భరత్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి ఉన్నత కుటుంబంకు చెందినది. ఆమెకు హైదరాబాద్‌లో ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ ఉండేది. ఆ అపార్ట్‌మెంట్‌ను రవితేజ కుటుంబ సభ్యులు ఉండేందుకు ఆమె ఇవ్వడం జరిగింది. భరత్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఇద్దరు కలిసి అమెరికా వెళ్లి పోయారు. అక్కడ ఇద్దరు వేరు వేరు ఉద్యోగాలు చేసేవారు. ఆ సమయంలోనే రవితేజ హైదరాబాద్‌లో ఉండేందుకు అపార్ట్‌మెంట్‌ లభించడంతో అందులో ఉండి సినీ ప్రయత్నాలు చేసేవాడు.

అప్పటికే సహాయ దర్శకుడిగా రెండు మూడు సినిమాల్లో నటించిన రవితేజ ఆ తర్వాత హీరోగా కూడా అవకాశాలు దక్కించుకున్నాడు. అపార్ట్‌మెంట్‌లో స్థానం దక్కడం వల్లే రవితేజ హైదరాబాద్‌లోనే ఉండి మరి కొన్ని రోజులు ప్రయత్నాలు చేయాలని భావించాడు. మొత్తంగా చూస్తే భరత్‌ భార్య వల్లే రవితేజ హైదరాబాద్‌లో ఉన్నాడు, ఆ తర్వాత కొన్నాళ్లకు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. ఇప్పటికి కూడా ఆమె అమెరికాలో ఉంటుంది. భరత్‌ దాదాపు 10 సంవత్సరాలుగా ఆమెకు దూరంగా ఉంటున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

To Top

Send this to a friend