రకుల్‌కు ఉత్తమ నటి అవార్డు ఏంటో..?


తెలుగు సినిమా పరిశ్రమతో పాటు సౌత్‌ సినీ పరిశ్రమకు చెందిన అన్ని భాష చిత్రాలకు ప్రతి సంవత్సరం సైమా పేరిట దుబాయిలో అవార్డులు ఇవ్వడం పరిపాటిగా వస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా దుబాయిలో సైమా అవార్డు వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అంతా సాఫీగానే జరుగుతుండగా ఉత్తమ నటి తెలుగుకు గాను రకుల్‌ను ఎంపిక చేయడం ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది.

ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో నటించినందుకుగాను సైమా ఉత్తమ నటిగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అవార్డును అందుకుంది. ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యతే ఉండదు. కొన్ని సీన్స్‌లలో ఆమె నటించినా కూడా అవార్డు ఇచ్చేంత సీన్‌ మాత్రం లేదు అని, గత సంవత్సరం తెలుగులో ఎన్నో మంచి చిత్రాలు వచ్చాయి, అందులో హీరోయిన్స్‌గా నటించిన పలువురు ఉత్తమ నటనను కనబర్చారు. పెళ్లి చూపులు చిత్రంలో నటించిన రీతూ వర్మ మరియు ‘అఆ’ చిత్రంలో నటించిన సమంత ఇంకా పలువురు కూడా మంచి నటనతో ఆకట్టుకున్నారు.

రకుల్‌ కంటే ఇంకా ఉత్తమంగా పలువురు హీరోయిన్స్‌ నటించారు. మరి సైమా వారు  రకుల్‌నే ఎందుకు ఎంపిక చేశారు అనే విషయం వారే చెప్పాలి. ఇలా అవార్డులను ఎవరికి పడితే వారికి ఇవ్వడం వల్ల కొన్నాళ్లకు ప్రాభవం కోల్పోవాల్సి వస్తుందనే విషయాన్ని సైమా గుర్తించాలంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వస్తున్నాయి.

To Top

Send this to a friend