బాలయ్యకు ఫుడ్‌ పాయిజన్‌


నందమూరి బాలకృష్ణ అనారోగ్యంతో హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యారు. తాజాగా ‘శమంతకమణి’ ఆడియో వేడుకలో పాల్గొనాల్సి ఉండగా, చివరి నిమిషంలో హాస్పిటల్‌లో చేరడం వల్ల హాజరు కాలేక పోయాడు. మద్యాహ్నం తీసుకున్న ఆహార పదార్థం కారణంగా ఫుడ్‌ పాయిజన్‌ అయినట్లుగా నందమూరి కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. బాలయ్య ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని, ఒక్క రోజులోనే పూర్తిగా రికవరీ అయినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

‘శమంతకమణి’ చిత్రం భవ్య క్రియేషన్స్‌లో తెరకెక్కుతుంది. ఇప్పుడు అదే బ్యానర్‌లో బాలయ్య ‘పైసా వసూల్‌’ చిత్రం తెరకెక్కుతుంది. అందుకే పూరి మరియు బాలయ్యలు ‘శమంతకమణి’ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొంటారని నిర్మాత చెప్పుకొచ్చాడు. అయితే బాలయ్య అనారోగ్య కారణంగా హాజరు కాలేక పోయాడని చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు.

సుధీర్‌బాబు, నారా రోహిత్‌, సందీప్‌ కిషన్‌, ఆదిలు హీరోలుగా తెరకెక్కిన ‘శమంతకమణి’ చిత్రాన్ని శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కించాడు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌ మరియు ట్రైలర్‌లు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తప్పకుండా సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని నిర్మాతలు చెబుతున్నారు.

To Top

Send this to a friend