బాలయ్య సాహసం.. ఎన్టీఆర్ బయోపిక్ వర్మ చేతిలో..


హీరో బాలక్రిష్ణ సాహసం చేస్తున్నాడనే చెప్పాలి.. ఎందుకంటే తెలుగు వారిపై రాజకీయ నాయకుడిగా.. నటుడిగా చెరగని ముద్రవేసిన ఎన్టీఆర్ బయోపిక్ ను కాంట్రావర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ చేతిలో పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. రాంగోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్ ను తీయబోతున్నట్టు ట్విట్టర్ సాక్షిగా ప్రకటించారు. అంతేకాదు.. ఎన్టీఆర్ మీద స్వయంగా వర్మ రాసిన ‘జై ఎన్టీఆర్’ పాటను కూడా సోషల్ మీడియాలో విడుదల చేశారు.

వర్మ ట్విట్టర్ లో పలు వివాదాస్పదం అంశాలను టచ్ చేశారు. అత్యంత నిజమైన మహామనిషి ఎన్టీఆర్ బయోపిక్ లో ఆయన శత్రువులెవరు.? నమ్మకద్రోహులెవరు ఎవరికీ తెలియని కాంట్రవర్సీల వెనుకాల అసలు కాంట్రవర్సీలు ఏమిటో అవన్నీ ప్రజానీకానికి తాను సినిమాల ద్వారా వెల్లడిస్తానని వర్మ ప్రకటించారు.

తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటిన నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను తీయబోతున్నట్టు అప్పట్లోనే ఆయన కుమారుడు , హీరో నందమూరి బాలక్రిష్ణ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి దర్శకుడు ఎవరనేది బాలయ్య అప్పుడు వెల్లడించలేదు. కానీ ఇప్పుడు బాలక్రిష్ణ .. పూరి జగన్నాత్ తోడ్పాటుతో ముంబైలో రాంగోపాల్ వర్మను కలిశారు. ఎన్టీఆర్ బయోపిక్ ను తీయాలని కోరగా.. ఆయన సరేనన్నారు..

వర్మ ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నట్టు చెప్పడమే కాకుండా ట్విట్టర్ లో ఓ పాటను, వాయిస్ మెసేజ్ ను రిలీజ్ చేశారు. అందులో ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని.. పొగడరా నీ తండ్రి ఎన్టీఆర్ ను’ అని వర్మ వాయిస్ మెసేజ్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఇలా బాలక్రిష్ణ తన తండ్రి బయోపిక్ ను వర్మ చేతిలో పెట్టడం.. దాన్ని వర్మ ప్రకటిస్తూ రచ్చరచ్చ చేయడం జరిగిపోయింది. వర్మ ఈ సినిమాతో తెలుగు రాజకీయాలను కుదిపేయబోతున్నాడా అనే ఉత్కంఠ ప్రస్తుతం కొనసాగుతోంది.

To Top

Send this to a friend