బాలయ్య .. నువ్ గ్రేట్ అబ్బా..


తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింప్లిసిటీ అనే పదానికి కేరాఫ్ అడ్రస్ హీరో నందమూరి బాలక్రిష్ణ. ఆయన జనంలో ఇట్టే కలిసిపోతాడు. తానో టాప్ హీరో అని ఎక్కడా భావించడు. అందుకే ఎమ్మెల్యేగా కూడా రాణిస్తున్నాడు. బాలయ్య ఎంత సాధారణంగా ఉంటాడో.. మిగతా హీరోలకు ఎంత విభిన్నమో ఒక సంఘటన మరోసారి గుర్తు చేసింది.

సినిమా షూటింగ్ జరుగుతుందంటే హీరోలకు సకల సౌకర్యాలు ఉంటాయి. కానీ బాలయ్య ఇవేవీ ఉన్నా కూడా ఎంతో సాదాసీదాగా స్పాట్ లో ఉంటాడో ఈ సంఘటన గుర్తుచేసింది. ప్రస్తుతం పోర్చుగల్ దేశంలో పూరి జగన్నాత్ దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తున్నారు. సినిమా షూటింగ్ గ్యాప్ లో బాలయ్య ఓ చెట్టుకింద గడ్డిపై కేవలం ఒక దిండు పెట్టుకొని పడుకోవడం యూనిట్ సభ్యులను సంభ్రమాశ్చార్యాలకు గురిచేసింది.

తానో అగ్రహీరో.. ఏసీ బస్సులున్నా కూడా ఆ రాజసం ఏదీ లేకుండా సాదాసీదాగా చెట్టుకింద పడుకున్న బాలయ్య ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలక్రిష్ణ నిరాడంబరంగా ఉండడం చూసి ఆ సినిమా నిర్మాత, భవ్య క్రియేషన్స్ అధినేత ఆనంద ప్రసాద్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాలయ్య సింప్లిసిటీ ఎలా ఉంటుందో స్వయంగా ఓ ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

To Top

Send this to a friend