బాలయ్య ఓవైపు.. జగన్, రోజా మరోవైపు.. బాబు ఏడీ.?

నంద్యాల సమరం ఊపందుకుంది. ఉప ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో అన్ని పార్టీలు ఇప్పుడు నంద్యాలలో మోహరించాయి. ఓ వైపు వైసీపీ తరఫున జగన్,రోజా గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజలను ఆకర్షించే పనిలో పడగా.. మరోవైపు హీరో బాలక్రిష్ణ టీడీపీకి ఓట్లు వేయించే పనిలో చురుగ్గా ప్రచారం చేస్తున్నాయి. అయితే సీఎం చంద్రబాబు ఇంకా నంద్యాల ఎన్నికల ప్రచార బరిలోకి దిగలేదు.

జగన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వైసీపీ తరఫున బరిలో నిలిచిన శిల్పా మోహన్ రెడ్డిని గెలిపించడానికి శతథా ప్రయత్నిస్తున్నారు. కీలక వైసీపీ నేతలందరూ ఇప్పుడు నంద్యాలలోనే మకాం వేసి వైసీపీ గెలుపుబాటకు దోహదపడుతున్నారు.

అయితే చంద్రబాబు ఇంకా ప్రచార బరిలో దిగలేదు. ఆయన బావమరిది, ఎమ్మెల్యే హీరో బాలక్రిష్ణ.. కర్నూలులో తనకున్న ఫ్యాన్స్, ఆకర్షణను ఉపయోగించుకొని టీడీపీకి ప్రచారం చేస్తున్నారు. ఆయన సభలకు జనం బాగానే తరలివస్తున్నారు. ఇక భూమా అఖిలప్రియ, బ్రహ్మానందారెడ్డిలు కూడా తమ శక్తి మేరకు ప్రయత్నిస్తున్నారు. కానీ వీరి ప్రచారం చుక్కాని లేని నావలా మారింది. చంద్రబాబు ప్రచారంలోకి దిగకపోవడంతో ఆ లోటు స్పష్టం గా కనిపిస్తోంది.

To Top

Send this to a friend