బాలయ్య గొంతులో బేస్ తగ్గిందా.?

బాలక్రిష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పైసా వసూల్’. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. ఇందులో ఒకటే మైనస్ అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పూరి మార్క్ డైలాగులకు బాలయ్య డైలాగ్స్ చెప్పడం సరిగా లేదా.? లేక నిజంగా బాలయ్య గొంతు చేంజ్ అయ్యిందా అన్న ఆందోళన ఆయన అభిమానుల్లో నెలకొంది. సెప్టెంబర్ 1న సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు యూనిట్ సిద్దపడుతుండగా.. ట్రైలర్ లో బాలయ్య తీరు చూశాక అభిమానుల్లో ఆందోళన మొదలైంది.

సినిమా మొత్తం బాలయ్య వాయిస్ ఇలానే ఉంటే మాత్రం కష్టమంటున్నారు సినీ క్రిటిక్స్. మునిపటి బాలయ్య డైలాగుల్లా ఇందులో లేకపోవడం లోటు గా పేర్కొంటున్నారు. బాలయ్య గొంతులో వణుకు.. తడబాటు విన్నాక సినిమాలో ఇదే పెద్ద మైనస్ అంటున్నారు. ఇప్పటివరకు బాలక్రిష్ణ అంటేనే డైలాగ్ కింగ్. బాలయ్య రాయలసీమ ఫ్యాక్షన్ డైలాగులకు థియేటర్లు చప్పట్లు పడతాయి. అయితే పైసా వసూల్ ట్రైలర్ లో బాలయ్య వాయిస్ మైనస్ గా నిలిచిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అసలు బాలయ్య వాయిస్ ఎందుకని ఇలా మారిందని టాలీవుడ్ లో చర్చ మొదలైంది.

రెండు నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్ లో బాలక్రిష్ణ యాక్షన్, కామెడీ, ఆటపాటలు, సరదా డైలాగులు ఆకట్టుకున్నాయి. డైలాగ్స్ చాలా కొత్తగా.. పూరి స్టైల్లో… బాలయ్య బేస్ తగ్గి చెప్పిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మాస్ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ మొత్తం బాలయ్య స్టైల్, పూరి జగన్నాథ్ మార్క్ డైలాగ్స్ స్పష్టంగా కనిపిస్తోందని అభిమానులు సంబరపడుతున్నారు.. అయితే బాలయ్య గొంతులో వణుకు, ముసలి వాయిస్ మాత్రం అందరినీ కలవరపెడుతున్నాయి.

To Top

Send this to a friend