టీడీపీ కార్యకర్తను కొట్టిన బాలక్రిష్ణ

 

 

మొన్నటికి మొన్న బాలయ్య తన కొత్త సినిమా ప్రారంభం సందర్భంగా షూలు విప్పలేదని తన అసిస్టెంట్ ను కొట్టి అభాసుపాలైన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరిచిపోకముందే మరో ఘటన బాలయ్యకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఈసారి తన కోపాన్ని అణుకోకుండా ఓ టీడీపీ కార్యకర్తపై దురుసుగా ప్రవర్తించి బాలయ్య పరువు పోగొట్టుకున్నాడు.

నంద్యాల ఉపఎన్నికల్లో ప్రచారం చేస్తున్న బాలయ్య దురుసు ప్రవర్తన టీడీపీని చిక్కుల్లో పడేసింది. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా బుధవారం టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసిన బాలక్రిష్ణ రాత్రి బస కోసం పట్టణంలోని ఓ లాడ్జి వద్దకు వచ్చారు. ఆ సమయంలో ఓ అభిమాని తన ఫేవరేట్ హీరో బాలయ్యకు దండ వేసి ఫొటో దిగాలని ఆశపడి దగ్గరకు వెళ్లాడు. దీంతో ఆగ్రహించిన బాలయ్య ఒక్కసారి కార్యకర్తపై దాడి చేశాడు. అతడి చెంప చెల్లుమనిపించాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు బాలయ్య తీరు చూసి షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్ లైన్ లో పెట్టడంతో విషయం వైరల్ గా మారి టీడీపీకి సంకటంగా మారింది..

ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో ఇలా బాలక్రిష్ణ ప్రవర్తించడంతో ప్రతిపక్ష వైసీపీ దాన్ని చిలువలు పలువలు చేస్తూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తోంది.దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది నంద్యాలలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బగానే టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

To Top

Send this to a friend