మూడు సంవత్సరాలుగా మోక్షజ్ఞ మిస్సింగ్‌!!

నందమూరి ఫ్యాన్స్‌ చాలా కాలంగా ఎంతో ఆసక్తిగా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. బాలకృష్ణ కొన్నాళ్ల క్రితం మోక్షజ్ఞను 2018లో ప్రేక్షకులకు పరిచయం చేస్తాను అంటూ మాట ఇచ్చాడు. 2017లో మోక్షజ్ఞ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని అంతా భావించారు. ఈ సంవత్సరం చివరి వరకు మోక్షజ్ఞ ప్రాజెక్ట్‌పై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం మోక్షజ్ఞ ఎలా ఉన్నాడో నందమూరి ఫ్యాన్స్‌తో పాటు సినీ వర్గాల వారిలో చాలా మందికి తెలియదు.

మోక్షజ్ఞ కొత్త ఫొటోల కోసం గూగుల్‌ను అడిగితే ఎప్పటివో పాత ఫొటోలు ఇస్తుంది. గత మూడు సంవత్సరాలుగా మోక్షజ్ఞ కెమెరా ముందుకు రాలేదు. అంటే ఈ గ్యాప్‌లో మోక్షజ్ఞలో చాలా మార్పులు వచ్చి ఉంటాయి. ఇటీవల బాలకృష్ణ పోర్చ్‌గల్‌లో ఉన్న సమయంలో బర్త్‌డే వేడుకలో కుటుంబ సభ్యులు అంతా కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో మోక్షజ్ఞ కూడా అక్కడే ఉన్నాడు. కాని మోక్షజ్ఞ ఫొటో మాత్రం బయటకు రాలేదు.

అంటే బాలకృష్ణ తన కొడుకును సర్‌ప్రైజ్‌గా ఫ్యాన్స్‌ ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం మోక్షజ్ఞ ఎలా ఉన్నాడో అని అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ మోక్షజ్ఞ ఫొటోలు బయటకు రాకుండా చూస్తున్నారు. ప్రస్తుతం మోక్షజ్ఞ విదేశాల్లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అక్కడ సినిమాకు సంబంధించిన కోర్సు చేస్తున్నాడు. ఆ మద్య కొన్నాళ్లు గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంకు వర్క్‌ చేశాడని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో కూడా మోక్షజ్ఞను చూశామని ఏ ఒక్కరు చెప్పలేదు. దాదాపుగా మూడు సంవత్సరాలుగా మోక్షజ్ఞ కనిపించకుండా పోయాడు. ఇంకా ఎన్నాళ్లకు ఈ నందమూరి ప్రిన్స్‌ వస్తాడు, ఎలా వస్తాడు అంటూ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

To Top

Send this to a friend