బాహుబలిని కొడతానంటున్నబాలీవుడ్ హీరో


రగిలిపోతోంది.. బాహుబలి రిలీజ్ తర్వాత బాలీవుడ్ మొత్తం రగిలిపోతోందట.. ఒక ప్రాంతీయ భాష చిత్రం ఇండియన్ సినిమా చరిత్రనే లిఖించడంపై బాలీవుడ్ అగ్రహీరోల్లో అంతర్మథనం మొదలైనట్టు టాక్.. అందుకే బాహుబలి రికార్డులను చెరిపివేయాలని కృతనిశ్చయంతో ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యారట.. బాహుబలి విడుదలై 1000 కోట్ల కలెక్షన్లు దాటినా ఒక్క బాలీవుడ్ అగ్రహీరో కూడా ఈ సినిమాను కీర్తించకపోవడంతో వారు అసూయ పడుతున్నారనే విషయం అర్థమవుతూనే ఉంది.

బాహుబలి రికార్డులను బద్దలు కొట్టాలని బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలిసింది. అందులో భాగంగా తాను త్వరలో తీయబోయే చిత్రానికి గాను రూ.500 కోట్ల బడ్జెట్ తో భారీగా విజువల్ ఎఫెక్ట్ తో తీయాలని డిసైడ్ అయ్యారట.. అమీర్ ఖాన్ ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్నట్టు తెలిసింది..

అమీర్ ప్రస్తుతం తన కొత్త చిత్రం థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమాకు డైరెక్టర్ గా ధూమ్ 3 కి దర్శకత్వం వహించిన విజయ్ కృష్ణ వ్యవహరించారు. ఈ సినిమా కథ పైరెట్స్ ఆఫ్ కరేబియన్స్ తరమాలో ఉంటుదట.. అందుకనుగుణంగా బడ్జెట్ పెంచి సినిమాను భారీగా తీయాలని అమీర్ ఖాన్ సూచించారట.. బాహుబలి చూసిన కళ్లతో ఏ సినిమా చూసినా ప్రేక్షకులు తక్కువగానే అనుకుంటారని.. అందుకని వెంటనే బడ్జెట్ పెంచి కథలో గ్రాఫిక్స్, మలుపులు పెట్టాలని దర్శకుడిని కోరారట.. ఎలాగైనా బాహుబలి రికార్డులు బ్రేక్ చేయాలని అమీర్ కృతనిశ్చయంతో ఉన్నారట.. సో బాహుబలి ఎఫెక్ట్ బాలీవుడ్ హీరోల మీద భారీగానే పడినట్టు అర్థమవుతోంది.

To Top

Send this to a friend