బాహుబలికి అలాంటి చీప్‌ పబ్లిసిటీ కావాలా?

‘బాహుబలి 2’ చిత్రం బాలీవుడ్‌ చిత్రాల కలెక్షన్స్‌ను దాటేసి, హిందీ స్టార్‌ హీరోలు కూడా అందుకోలేని స్థాయిలో నిల్చిన విషయం తెల్సిందే. 1500 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘బాహుబలి’ సినిమాకు ప్రత్యేకంగా ప్రచారం చేయనక్కర్లేదు. మౌత్‌ టాక్‌తో పాటు, కలెక్షన్స్‌ను పబ్లిసిటీ చేస్తూ టీవీ ఛానెల్స్‌ ఫుల్‌గా పబ్లిసిటీ చేస్తున్నాయి. ఈ సమయంలోనే ‘బాహుబలి’ సినిమాకు మళ్లీ భారీగా పబ్లిసిటీ వచ్చేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు కొత్త ప్లాన్‌ ఒకటి చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

సినిమాకు సంబంధించి కొత్తగా మూడు నిమిషాల పాటు సీన్స్‌ను యాడ్‌ చేయాలని భావిస్తున్నారట. ఆ సీన్స్‌తో మళ్లీ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని ‘బాహుబలి’ మేకర్స్‌ ఆశిస్తున్నారు. అయితే ఆ నిర్ణయాన్ని తప్పుడు నిర్ణయంగా ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు భావిస్తున్నారు. బాహుబలి సీన్స్‌ యాడ్‌ చేయాలనేది చీప్‌ పబ్లిసిటీ స్టంట్‌ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

సీన్స్‌ యాడ్‌ విషయం నిజం కాదు అని, సినిమాకు అలాంటి పబ్లిసిటీ అవసరం లేదు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. కొత్త సీన్స్‌ యాడ్‌ చేయబోతున్నారనేది కూడా పుకారే అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బాహుబలికి ఇప్పటికే భారీగా కలెక్షన్స్‌ వచ్చాయి. ఇంకా కలెక్షన్స్‌ను రాబట్టడం అంత సులభమైన విషయం ఏం కాదని ట్రేడ్‌ పండితులు అంటున్నారు.

To Top

Send this to a friend