బాహుబలి  నెట్ లో..


భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బాహుబలి చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎంతో మంది ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా విడుదలవుతోంది. కానీ ఇప్పటికే ప్రీమియర్ షోలు వేసేశారు. హిట్ టాక్ రావడంతో టికెట్ల కోసం రద్దీ ఎక్కువైంది. కానీ ఫైరసీ వ్యవహారం బాహుబలి టీంకు కలవరపరుస్తోంది.

ఈ సినిమా మొదటి 50 నిమిషాలు అప్పుడే ఇంటర్ నెట్ లో లీకైంది. సినిమా లీక్ అయ్యిందని తెలిసి నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా నిందితులను కనుగొనే పనిలో పడ్డారు. నిన్న సాయంత్రం ఈ సినిమా బెన్ ఫిట్ షోను పలు చోట్ల ప్రదర్శించారని.. అక్కడే కొంత మంది వీడియోను రికార్డ్ చేసి ఇంటర్ నెట్ లో పెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

కాగా టోరెంట్ లాంటి ఫైరసీ సినిమాలు ఉండే సైట్లలో.. కొన్ని తమిళ పేరుతో ఉన్న సైట్లలో ఈ 50 నిమిషాల ఫైరసీ వీడియో హల్ చల్ చేస్తోంది. ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా కూడా ఈ పైరసీని నియంత్రించలేకపోతున్నారు. పైగా డౌన్ లోడ్ చేసుకునే ఆఫ్షన్ కూడా ఉండడంతో ఎక్కువమంది డౌన్ లోడ్ చేసుకొని వీడియోను షేర్ చేస్తున్నారు.

ఈ పరిణామాలు నిర్మాతల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఈ పైరసీ లింక్ వాట్సాప్ లో కూడా వ్యాప్తి చెందుతుండడంతో మరింత కలవరపాటు మొదలైంది. సినిమా విడుదలైన మొదటిరోజే ఈ పైరసీ ప్రింట్ లీక్ చేయడంపై నిర్మాతలు ఎవరు చేశారనే దానిపై విస్తృత శోధన మొదలుపెట్టారట.. లక్షల మంది కష్టం బాహుబలి సినిమా అని పైరసీని ఎంకరేజ్ చేయొద్దని బాహుబలి నిర్మాతలు పైరసీకి వ్యతిరేకంగా ప్రజలకు, మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నారు.

To Top

Send this to a friend