బాహుబలి మేనియా ఇంకానా.?

‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అక్షయ్ కుమార్ సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. దాంతో బాహుబలి తర్వాత మొట్టమొదటి విజయం అందుకున్న సినిమాగా అక్షయ్ కుమార్ సినిమా నిలిచి సంచలనం సృష్టించింది. సో ఇలా బాహుబలి మేనియాలో తెలుగు ప్రేక్షకులు కొద్దిగా పడితే హిందీ ప్రేక్షకులు పూర్తిగా పడిపోయారు.. ఆ కళాఖండం నుంచి ఇప్పటికీ తేరుకోకుండా కథ లేని సినిమాలకు ప్లాప్ లు కట్టబెడుతున్నారు.

బాహుబలి తర్వాత విడుదలైన బాలీవుడ్ సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. బాహుబలిని చూసిన జనాలకు తమ అభిమాన టాప్ హీరోలు తీసిన సినిమాలు ఏమాత్రం నచ్చలేదట.. అందుకే కొన్నాళ్లుగా బాలీవుడ్ బాద్ షాలందరూ ఇప్పుడు ప్లాప్ తెచ్చుకున్నారు. షారుఖ్ ఖాన్ ఇటీవల తేసిన ‘రాయిస్’ అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే.. ఇక సల్మాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన ‘ట్యూబ్ లైట్’ పగిలిపోయింది. ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదు. చిన్న, పెద్ద హీరోల సినిమాలు కూడా బాహుబలి తర్వాత ఏ ఒక్కటి హిట్ కొట్టలేదు. దీంతో తలపట్టుకుంటున్న పరిశ్రమను ఇప్పుడు మిస్టర్ డిపండబుల్ గా పేరున్న స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఆపద్భాంధవుడిగా మారి హిట్ ఇచ్చాడు.

బాహుబలి రిలీజ్ అయ్యి 100 రోజులు పూర్తయ్యింది. కానీ ఇప్పటికీ సినీ పరిశ్రమ ఆ మేనియా నుంచి బయటపడడం లేదట.. ప్రేక్షకులు ఆ సినిమాను చూసి వేరే సినిమాను చూసేసరికి ఏదీ నచ్చడం లేదు. తెలుగులో కాస్త నయం.. హీరో నాని ఇటీవల మంచి కథతో సినిమాలు తీసి హిట్ కొట్టాడు. హిందీలో అయితే మరీ ఘోరంగా తయారైందట పరిస్థితి.

To Top

Send this to a friend