ఆమెను వెంటాడి ఇబ్బంది పెడుతున్న బాహుబలి..?

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ రెండు పార్ట్‌లు కూడా అద్బుత విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా ‘బాహుబలి 2’ బాలీవుడ్‌ సినిమాల స్థాయిని కూడా దాటేసి హాలీవుడ్‌ సినిమాల స్థాయిలో నిలిచింది. దాదాపుగా 1600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అలాంటి సినిమాలో ఒక ముఖ్య పాత్రలో శ్రీదేవిని రాజమౌళి అనుకున్నాడు. అయితే ఆమె కాస్త అతి చేయడంతో ఆ స్థానంలో రమ్యకృష్ణను ఎంపిక చేయడం జరిగింది.

‘బాహుబలి’ మొదటి పార్ట్‌ విడుదలైనప్పటి నుండి కూడా శ్రీదేవిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ‘బాహుబలి’ వంటి అద్బుత చిత్రాన్ని వదిలేసుకున్నందుకు శ్రీదేవిపై సినీ వర్గాల వారు అంతా కూడా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా ‘బాహుబలి 2’ చిత్రం విడుదల తర్వాత ఆ విమర్శలు మరింత ఎక్కువ అయ్యాయి. ఆ సినిమాను వదులుకున్నందుకు శ్రీదేవి కూడా చాలా పశ్చాతాప పడుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

ఈ సమయంలోనే శ్రీదేవి ‘మామ’ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతున్న సమయంలో శ్రీదేవిని బాహుబలి వెంటాడి ఇబ్బంది పెడుతున్నాడు. ప్రతి మీడియా సమావేశంలో కూడా మీరు బాహుబలి వదిలేశారు కదా, ఏమనిపిస్తుంది, అసలు బాహుబలిని ఎందుకు వదిలేశారు అంటూ ప్రశ్నలు మీడియా నుండి వస్తున్నాయి. వాటికి బాహుబలి అయిపోయిన విషయం, ఇప్పుడు దాని గురించి మాట్లాడాని తాను భావించడం లేదు అంటూ శ్రీదేవి చెబుతుంది. మొత్తానికి ‘బాహుబలి’ అతిలోక సుందరికి బాగా చిరాకు తెప్పిస్తున్నాడు.

To Top

Send this to a friend