చరిత్ర తిరగరాసిన బాహుబలి2

కోటి .. 100 కోట్లు కాదు.. వెయ్యి కోట్లు కాదు.. 1500 కోట్లు.. భారతీయ సినిమా ఆ స్థాయిని అందుకుంటున్న మరుపురాని రోజులివి.. ఇన్నాళ్లు ఇంగ్లీష్ సినిమాలకే  సాధ్యమైన 1000 కోట్ల కలెక్షన్లు.. దాటి ఒక భారతీయ సినిమా కేవలం 21 రోజుల్లోపే 1500 కోట్లు సాధించడం యావత్ ప్రపంచాన్ని నివ్వెర పరుస్తోంది..


బాహుబలి2.. ఓ సంచలనంగా మారింది.. ఇప్పటివరకు భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అమీర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ మొదటి స్థానంలో ఉంది. ఇటీవలే చైనాలో విడుదల చేసిన మూవీ 1000 కోట్ల మార్కును దాటింది.  పీకే (792 కోట్లతో) రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత బాహుబలి1 (650 కోట్లు) మూడో స్థానంలో ఉన్నాయి.
కానీ ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమాకు సాధ్యం కాని 1500 కోట్ల వసూళ్లు సాధించి రాజమౌళి చెక్కిన బాహుబలి2 దూసుకుపోతోంది. ఈ లక్ష్యాన్ని చూసి సినీ అనలిస్ట్ , ట్రేడ్ పండితులే నోరెళ్ల బెడుతున్నారు.

బాహుబలి ఇటీవలే 1000 కోట్లు సాధించిందని హిందీ లో విడుదల చేసిన కరుణ్ జోహర్ ప్రకటించారు.  ఏప్రిల్ 27న రిలీజ్ అయిన బాహుబలి2 8000 స్క్రీన్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శితమవుతోంది. ఇండియాలో ఈ సినిమా ఇప్పటివరకు రూ.1227 కోట్లు గ్రాస్ సాధించింది. విదేశాల్లో రూ.275 కోట్లు సాధించింది.  దీంతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వరకు  1502 కోట్లు సాధించి బాహుబలి2 రికార్డులకెక్కింది.

To Top

Send this to a friend