బాహుబలి బాలయ్య.. భళ్లాల ఎన్టీఆర్..


మూవీ ప్రమోషన్ లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన రానా బాహుబలి పాత్రలు ఎవరు పోషిస్తే బాగుంటుందో వివరించారు. ఒకవేళ తానే దర్శకత్వం వహిస్తే బాహుబలి పాత్రను బాలకృష్ణకు ఇస్తానని.. భళ్లాల పాత్రను జూనియర్ ఎన్టీఆర్ కు ఇస్తానని స్పష్టం చేశారు. కానీ శివగామిగా రమ్యక్రిష్ణ పాత్రను ఆమె తప్ప ఎవరూ భర్తీ చేయలేరన్నారు.

పౌరాణిక పాత్రలు పోషించడంలో తెలుగులో బాలక్రిష్ణ మాత్రమే సూపర్ అని రానా కితాబిచ్చాడు. ఆదిత్య 369 కానీ, గౌతమిపుత్ర శాతకర్ణి లో బాలయ్య నటన అద్భుతమన్నారు. బాలక్రిష్ణలా జీవించే నటుడు తెలుగు ఇండస్ట్రీలో లేడన్నారు. ఇక భళ్లాలగా రాజసం ఉట్టిపడే పాత్ర చేయాలంటే అది జూనియర్ ఎన్టీఆర్ కే సాధ్యమన్నారు. హవభావాలు, భళ్లాళుడి కోపం, ఆవేశం నవరసాలు పోషించే సత్తా నేటి తరంలో కేవలం ఎన్టీఆర్ కే ఉందని చెప్పుకొచ్చారు.

రానా తన డ్రీం ప్రాజెక్టు బాహుబలిలో తను కాకుండా ఇద్దరు తెలుగు దిగ్గజ నటులను పాత్రకు ఎంపిక చేయడం ఆకట్టుకుంది. ఒకవేళ ప్రభాస్, రానా ఆ పాత్రలు పోషించకుంటే ప్రత్యామ్మాయంగా బాలయ్య, ఎన్టీఆరేనని రానా స్పష్టం చేయడం ఆ హీరోల స్టామినాను ప్రూవ్ చేసింది. ఎంతైనా బాబాయ్, అబ్బాయ్ నటనలో తమకు తామే సాటి అని నిరూపించుకున్నారు.

To Top

Send this to a friend