మెగా హీరోకు ఎంత కష్టం..

చూడగానే ఆరడుగుల అందం, అభినయం.. పైగా మెగా ఫ్యామిలీ ట్యాగ్ లైన్ ఇంకా ఏం కావాలి ఈ హీరోకు అని ఆనంద పడిపోనక్కర్లేదు… ప్రస్తుతం పేరు కావాలి…. ఆ హీరోకు క్రేజ్ కావాలి.. దానికోసమే వెంపర్లాడుతున్నాడీ మెగా హీరో.. సినిమాలో హీరో అతడే.. బయటా హీరోనే.. అయినా పేరు మాత్రం వేరొకరికి రావడంతో తట్టుకోలేకపోతున్నాడట..

హీరోగా నిలదొక్కుకున్న వరుణ్ తేజ్ లో ఇప్పుడు ఒక్కటే బాధ పట్టిపీడిస్తోంది. వరుణ్ మొదటి నుంచి మంచి అగ్ర దర్శకులు, టాలెంటెడ్ దర్శకులతోనే సినిమాలు తీశాడు. ఆ సినిమా విజయాలన్నీ ఆ దర్శకుల ఖాతాల్లోనే పడ్డాయి. హీరోగా వరుణ్ బాగా చేశాడని.. ఇది వరుణ్ క్రెడిట్ అని చెప్పే పరిస్థితిని ఆ సినిమాలు కల్పించలేదు.

శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన వరుణ్ తేజ్ మొదటి సినిమా ముకుందా..హిట్ కొట్టింది. కానీ ఆ విజయం డైరెక్టర్ ఖాతాలోకే పోయింది. ఇక ఆ తర్వాత కంచె సినిమా.. కళాత్మక క్రిష్ ఖాతాలోకే ఆ విజయ రహస్యం పోయింది. ఆ తర్వాత పూరీ అమ్మసెంటిమెంట్, శ్రీనువైట్ల మిస్టర్ లు ఆ హీరోను నిలబెట్టలేదు. కానీ ఇండస్ట్రీలో మాత్రం వరుణ్ తేజ్ హీరోగా నిలబడ్డాడు. అడపదడపా హిట్లతో ఇప్పుడు మెగా హీరోగానైతే స్థిరపడ్డాడు.

చాలా రోజుల తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విజయం సాధించడానికి ప్రధాన కారణం హీరోయిన్ సాయి పల్లవి తెలంగాణ యాస, భాష, నటనేనని ప్రశంసలు దక్కుతున్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కళ్లకు కడుతూ తీసిన ఫిదా మూవీ అందరినీ ఫిదా చేస్తోంది. తెలంగాణ ప్రాంతానికే చెందిన దిల్ రాజు తీసిన ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. కలెక్షన్లు కొల్లగొడుతోంది. శేఖర్ కమ్ముల నేచురల్ గా తీసిన విధానం కూడా మెచ్చుకుంటున్నారు.

అంతాబాగానే ఉన్న హీరో వరుణ్ తేజ్ ప్రస్తావన మాత్రం ‘ఫిదా’ హిట్ లో చోటు చేసుకోకపోవడం ఈ మెగా హీరోను కలవరపెడుతోందట.. ఎంతసేపు హీరోయిన్ సాయిపల్లవి, దర్శకుడు శేఖర్ కమ్ముల పేర్ల భజన తప్పితే హీరోగా తనకు క్రెడిట్ దక్కకపోవడంపై ఈ హీరో రగిలిపోతున్నట్టు తెలిసింది.. ఈ విషయాన్ని సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తూ వరుణ్ బాధపడినట్టు సమాచారం.

To Top

Send this to a friend