బాబూ.. ఉత్తరాది వాళ్లను చూసి నేర్చుకో..


జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ ద్వారా టీడీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టాడు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉత్తరాదికి చెందిన అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించడంపై ప్రశ్నించారు. అసలు దేశంలోనే దక్షిణాదిలో ఉన్న ఇంత పెద్ద పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రానికి ఈ ప్రాంతానికి చెందిన ఐఏఎస్ అధికారి దొరకడం లేదా అని ప్రశ్నించారు.

టీటీడీ ఈవోగా ఉత్తరాదికి చెందిన అధికారికి బాధ్యతలు అప్పజెప్పడానికి తాను వ్యతిరేకం కాదని.. మరి ఉత్తరాదికి చెందిన అమర్ నాథ్, వారణాసి, మధుర లాంటి దేవాలయాల్లో దక్షినాదికి చెందిన వారిని అధికారులుగా ఎందుకు నియమించడం లేదని ప్రశ్నించాడు. ఉత్తరాది అధికారిని టీటీడీకి ఎంపిక చేయడానికి గల కారణాలను ఏపీ సీఎం చంద్రబాబు, ఇతర మంత్రులు ప్రజలకు చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు.

 

To Top

Send this to a friend