బాబూ.. నీ పరపతి వేస్ట్ అబ్బా..


ప్రధాని నరేంద్రమోడీ అధికారం చేపట్టాక కేంద్ర ప్రభుత్వ నిధులు ఓ అందని ద్రాక్ష అయ్యాయి. దానికి కాపలాదారు మన మోడీ అయ్యారు. ఆయనకు నచ్చినోళ్లకు ద్రాక్ష పండ్లు ఇస్తున్నారు. నచ్చనోళ్లకు ఇవ్వడం లేదు. ఎంత అస్మదీయులైనా సరే మోడీజీ కోరుకుంటూనే పండ్లు దక్కేది. అంత కఠినంగా.. వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వంలో కొందరికి మాత్రం ఉన్న ఫళంగా నిధులు వస్తున్నాయి.

పూరి -కోణార్క్ పట్టణాల మధ్య కొత్త రైల్వేలైన్ ను మంజూరు చేయాలని ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో సగభాగాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, మోడీ కేంద్ర రైల్వే మంత్రి కి ట్వీట్ చేశారు. పర్యాటకాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ఈ లైన్ ఉపకరిస్తుందని చెప్పారు. ఈ ట్వీట్ చేసిన మూడు నిమిషాల్లోనే ఒడిషా సీఎం ట్వీట్ కు స్పందించారు కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు.. కొత్త రైల్వేలైన్ కు ఆమోదం తెలుపుతున్నామని సంతకాలు చేసేందుకు రెడీ గా ఉండాలని ఆయన సమాధానం ఇచ్చారట.. రాష్ట్రాలు సగం భరిస్తే వెంటనే ఆమోదం తెలుపుతామని.. ఇలానే సహకారం ఉండాలని ప్రభు సూచించారట..

దీంతో ఉబ్బితబ్బిబైన ఒడిశా సీఎం మోడీ, ప్రభుకు థ్యాంక్యూ చెప్పారట.. దీనికి ఓ లెక్క ఉందట.. ఒడిషా అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. దీంతో ఎలాగైనా ఒడిషియన్ల మద్దతు కూడగట్టుకునేందుకే కేంద్రం ఇలా వరాలు కురిపించదని టాక్..

కాగా ఒడిషా పక్క రాష్ట్రం ఏపీ కోరికలు మాత్రం నెరవేరడం లేదు.. ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే ఏపీలో విశాఖ రైల్వే జోన్.. రైల్వే లైన్లపై స్వయంగా సురేష్ ప్రభుకు, మోడీకి విన్నవించినా పనులు జరగడం లేదు. స్వయంగా కేంద్రరైల్వే మంత్రి రాజ్యసభ ఎంపీగా ఏపీనుంచే గెలిచినా ఆయన ఏం పనులు చేయడం లేదు. కానీ పొరుగు రాష్ట్రం సీఎం ట్వీట్ చేస్తే మోడీ అండ్ సురేష్ ప్రభు స్పందించడం చూశాక చంద్రబాబు షాక్ కు గురయ్యారని తెలిసింది. ఇది ఏపీ సీఎంను ఇరకాటంలోకి నెట్టింది.

To Top

Send this to a friend