బాబు తొండాట.. ప్రశాంత్ వ్యూహాలు కాపీ..

 

ప్రశాంత్ కిషోర్.. దేశంలోనే పేరొందిన రాజకీయ వ్యూహకర్త.. ఉత్తరప్రదేశ్ లో 2014 ఎన్నికల్లో బీజేపీ అత్యధిక ఎంపీ సీట్లు సాధించడంలో ప్రశాంత్ కిషోర్ దే కీలకపాత్ర. యూపీలో దాదాపు 70కిపైగా సీట్లు సాధించి ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రాగలిగింది ప్రశాంత్ వ్యూహాల వల్లే.. దాంతో పాటు బీహార్ లో నితీష్ ను, పంజాబ్ లో అమరేందర్ సింగ్ ను అధికారంలోకి తీసుకొచ్చారు ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు అధికారం కోసం అర్రులు చాస్తున్న జగన్ మోహన్ రెడ్డి ఈ వ్యూహకర్తను తెచ్చుకున్నాడు.

 

ప్రశాంత్ ఆలోచనల ప్రకారం ఏపీలో ముందుకెళ్తున్న జగన్ ఇటీవల ప్రజలపై 9 హామీలు గుప్పించాడు. అంతేకాదు దసరా తర్వాత రాష్ట్రమంతా పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు. ఇవన్నీ కూడా చంద్రబాబులో గుబులు పుట్టిస్తున్నాయి. జగన్ .. ప్రశాంత్ సూచనలకు అనుగుణంగా పోతుండడంతో ప్రజాభిమానం తారుమారు అవుతుందా అన్న ఆందోళన బాబులో పెరిగిపోతోందట.. అందుకే ప్రశాంత్ ఆలోచనలను, జగన్ పథకాలను కాపీ కొట్టి ముందే అమలు చేస్తే జగన్ హామీలకు విలువ ఉండదు కదా అన్న ఆలోచన బాబు చేస్తున్నట్టు సమాచారం.

 

అందులో భాగంగా చంద్రబాబు .. జగన్ హామీలపై కేబినెట్తోపాటు పార్టీలో చర్చింది త్వరలోనే ఏపీలో అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. 2019 ఎన్నికల్లో జగన్ ను గెలవనీయకుండా చేయాలంటే జగన్ ప్రకటించిన ప్రజాకర్షక హామీలు అమలు చేయాలని టీడీపీ నేతలు కూడా బాబుపై ఒత్తిడి తెస్తున్నారట.. ఇలా చంద్రబాబు తొండాట ఆడుతూ వైసీపీ పథకాలను కాపీ కొట్టాలనుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

To Top

Send this to a friend