రాజమౌళి బాహుబలితోనే వదలడం లేదు..

రాజమౌళి.. తన కలల సినిమా బాహుబలిని తీసి ప్రేక్షకులను అలరించడమే కాదు.. దీంతో మరిన్ని అద్బుతాలు చేస్తున్నాడు. ఇప్పటికే బాహుబలి సినిమాను బేస్ చేసుకొని పలు కామిక్స్ బుక్స్, కార్టూన్స్ , పిల్లలకు వినోదాన్ని పంచేందుకు బాహుబలి సీరియళ్లను వివిధ ప్రఖ్యాత సంస్థలతో కలిసి అందిస్తున్న సంగతి తెలిసిందే.. దీంతో సంతృప్తి పడకుండా రాజమౌళి ఇప్పుడు బాహుబలి కళాఖండాన్ని దాని లోని పాత్రలను బేస్ చేసుకొని గేమింగ్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు.  ఇందుకోసం ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’, బాటిల్ ఫర్ మిడల్ ఎర్త్ ’ లాంటి గేమ్స్ ను రూపొందించిన ప్రపంచ ప్రఖ్యాత గేమ్ ల రూపకర్త మార్క్ స్కాగ్ల్స్ తో భేటి అయ్యారు. దీనిపై రాజమౌళి, స్కాగ్ల్స్ చర్చించారు. బాహుబలి పేరు మీద ఒక మొబైల్ గేమ్ రూపొందించాలని డిసైడ్ అయ్యారట.. త్వరలోనే బాహుబలి గేమ్ రూపంలో మనకు అందుబాటులోకి రాబోతోంది..

రాజమౌళి తన బాహుబలి సిరీస్ లో మొదటి సినిమాను గ్రాండ్ హిట్ చేశారు. ఇప్పుడు రెండో సినిమాపై కసరత్తు చేస్తున్నారు. ఆ సినిమా విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేయడం కోసం ఇప్పుడు బాహుబలి గేమ్ లను రూపొందిస్తున్నారు. ఏప్రిల్ లో విడుదలయ్యే సినిమాకు హైప్ కోసం ఇలా గేమింగ్, కార్టూన్,  కామిక్స్ రూపొందిస్తూ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తూ ముందుకు సాగుతున్నారు.

To Top

Send this to a friend