అవార్డా.? రివార్డా: సుకుమార్-రాంచరణ్

గుబురు గడ్డం.. పూల చొక్కా.. లుంగీ కట్టుకొని కూర్చీలో కూర్చొని ఉన్న రాంచరణ్ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సుకుమార్ -రాంచరణ్ కాంబినేషన్ లోని చిత్రంలోని సన్నివేశంలో నటించేటప్పుడు ఎవరో తీసిన ఫొటో ఇది. ఈ ఫొటో సినిమాపై అందరిలోనూ ఆసక్తి రేపుతోంది..

రాంచరణ్ ఈ సినిమా చెవిటివాడిగా నటిస్తున్నారు. 1980లో ఓ పల్లెటూరిలో జరిగిన కథాంవంతో తెరకెక్కుతున్న చిత్రమిది. సమంత కూడా ఈ సినిమాలో మూగ అమ్మాయిగా నటిస్తోందట.. ఇలా మూగ అమ్మాయి-చెవిటి అబ్బాయి ప్రేమకథను అదీ పాత తరం స్టోరీని బేస్ చేసుకొని తీస్తుండడం .. రాంచరణ్ పాత్ర చిత్రణ, సమంత నటన అదిరిపోయేలా ఉన్నాయంటున్నారు చిత్రం యూనిట్.

కాగా సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తీసిన ఈ చిత్రం కమర్షియల్ సినిమాగా కనిపించడం లేదు. అలాగే మాస్ మసాలాలు ఉండడం లేదు. పక్కా పాత కాలంనాటి ఓ బ్లాక్ అండ్ వైట్ మూగ చెవిటి ప్రేమకథ.. విలక్షణ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సుకుమార్ ఈ సినిమాను అవార్డ్ కోసం తీస్తున్నాడా..? లేక ఏదైనా సందేశం ఇస్తున్నాడా అన్నది తేలకుండా ఉంది. ఇలాంటి కథలు జనాలు చూస్తారా అన్నది కూడా తేలాల్సి ఉంది.

To Top

Send this to a friend