జూలై 16నుంచి.. అందరూ రెడీగా ఉండండి..


ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోను జూలై 16నుంచి ప్రసారం చేయనున్నట్టు మాటీవీ ఒక ప్రకటనలో తెలిపింది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా హిట్ అయిన ఈ కార్యక్రమాన్ని స్టార్ మా టీవీ తెలుగులో నిర్వహిస్తోంది. ఈ ప్రోగ్రాం ఎలా ఉండబోతుందా అన్న ఉత్కంఠ ప్రస్తుతం నెలకొంది..

తెలుగు టీవీ చరిత్రలోనే అతిభారీ బడ్జెట్ పెద్ద కార్యక్రమం ఇదీ.. దాదాపు 100 మంది సెలబ్రెటీలను కలిసి ఈ షోలో పార్టిసిపెంట్ చేయాల్సిందిగా కోరాం. ఇందులోంచి 12 మందిని ఎంపిక చేశాం. వీరంతా 70రోజుల పాటు ఓ పెద్ద ఇంట్లో 60 కెమెరాల మధ్య బందీలుగా ఉంటారు. బయటి ప్రపంచంతో వీరికి ఏమాత్రం సంబంధం ఉండదు. ఇలా ఆ ఇంట్లో వీరు చేసే అన్ని పనులు వీడియోల సాయంతో చిత్రీకరిస్తారు.

ఇలా సెలబ్రెటీల మధ్య ఘాటు, గొడవలు, రోమాన్స్ అన్నింటిని కెమెరాలు క్యాప్చర్ చేస్తాయి. తెలుగులో మొదటి సారి వస్తున్న ఈ షోపై చాలా మంది ఆసక్తితో ఉన్నారు. ఆ 12 మంది సెలబ్రటీలు ఎవరనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతోంది. జూలై 16 నుంచి మొదలయ్యే ఈ ఇంట్రస్టింగ్ షో కోసం ఎదురుచూడడండి మరీ..

To Top

Send this to a friend