లోకేష్ కు అవమానం.. తెరపైకి అచ్చన్న

చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీఎంగా బిజీగా ఉన్నారు. రోజువారీ కార్యక్రమాలు.. ప్రభుత్వ పథకాల అమలు.. పార్టీ వ్యవహారాలు, ఎన్నికలతో నిత్యం బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులతో , ప్రజలతో ఎక్కువగా సాన్నిహిత్యం నెరపడం లేదట.. ఏదైనా సమస్య ఉంటే చంద్రబాబును కలవడం పార్టీలోని ముఖ్యులకే సాధ్యం కావడం లేదని వాపోతున్నారు. దీంతో చంద్రబాబుకు ప్రత్యామ్మాయంగా వ్యవహారాలన్నీ చక్కదిద్దేందుకు ఓ పెద్ద నాయకుడిని ఆయనకు సపోర్టుగా పెట్టాలని టీడీపీ సీనియర్లు నిర్ణయించారు. దీనికి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ ప్రభుత్వంలో బిజీగా ఉంటే.. వెనుకలా వైఎస్ ప్రాణ స్నేహితుడు కేవీపీ ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలన్నీ చక్కదిద్దేవారు. వైఎస్ ను కలవలేనివారందరూ కేవీపీకి విన్నవించేవారట.. కేవీపీ వైఎస్ కు చెప్పడం సమస్య పరిష్కారం కావడం జరిగిపోయేవి. ఇప్పుడు చంద్రబాబుకు ప్రత్యామ్మాయంగా సహాయక నాయకుడు లేకపోవడంతో ఆ లోటు ఏపీ ప్రభుత్వంలో స్పష్టం గా కనిపిస్తోందట..

ఇక టీడీపీ నేతల మనసులో ముందుగా మెదిలిన పేరు టీడీపీ సీనియర్ నేత ఫైర్ బ్రాండ్ అచ్చెన్నాయుడు అట.. గళంలో గంభీరంగా ప్రత్యర్థులను తన వాగ్ధాటితో ముప్పుతిప్పలు పెట్టే అచ్చెన్న అయితేనే బాబుకు తగిన సూచనలు ఇస్తారని.. ప్రజలు, నేతల సమస్యలను విని పరిష్కారానికి చొరవ చూపుతాడని టీడీపీ నేతలు భావిస్తున్నట్టు తెలిసింది. చంద్రబాబు తర్వాత ప్రభుత్వంలో, టీడీపీలో 2వ స్థానం అచ్చెన్నకు ఇచ్చి పార్టీని గాడిన పడేయాలని.. వచ్చే 2019 ఎన్నికల్లో గెలవాలంటే ఇది తప్పనిసరి అని భావిస్తున్నారట..

అయితే ఆశ్చర్యకరంగా టీడీపీ నేతలు చంద్రబాబు తరువాత ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ ను నామినేట్ చేయకుండా అచ్చెన్నాయుడు పేరును ప్రస్తావించడం సంచనలంగా మారింది. లోకేష్ లో ఆ క్వాలిటీలు లేవనే టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడుని చంద్రబాబు తరువాత నంబర్ 2 పొజిషన్ కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇదే జరిగితే లోకేష్ కు తీవ్ర అవమానం .. చంద్రబాబుకు సంకట పరిస్థితి ఖాయంగా కనిపిస్తోంది.

To Top

Send this to a friend