రజినీ రాజకీయ భవిష్యత్తుపై జ్యోతిష్యుల మాట!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకోసం ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంతో తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడింది. ఆ లోటును భర్తీ చేసేందుకు ఇదే సరైన సమయం అని భావించిన రజినీ వేగంగా అడుగులు వేస్తున్నారు. రాజకీయాల్లోకి పక్కా ప్రణాళికతో వచ్చేందుకు ప్లాన్ లు చేస్తున్నట్టు సమాచారం.

రజినీకాంత్ సినిమాల్లో ఇప్పటికే ఓ వెలుగు వెలుగుతున్నారు. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో రాణించాలనుకుంటున్నారు. అదే విషయంపై కొద్దిరోజులుగా రజినీ సమాలోచనలు జరుపుతున్నారు. అభిమానులతో భేటి అవుతున్నారు. పనిలో పనిగా ఆధ్యాత్మిక భావాలు మెండుగా ఉండే రజినీ తన రాజకీయ భవిష్యత్తుపై ఇటీవల నలుగురు జ్యోతిష్యులను కలిసి వేర్వేరుగా మాట్లాడినట్టు తెలిసింది. రాజకీయాల్లో రాణిస్తానా లేదా అన్న విషయంపై నలుగురు జ్యోతిష్యలను సంప్రదించగా వారు రజినీ రాజకీయ భవిష్యత్తుపై విశ్లేషించి చెప్పారట..

నలుగురు జ్యోతిష్యుల్లో ముగ్గురు రజినీ సీఎం అవుతారని చెప్పినట్టు సమాచారం. ఒక్కరు మాత్రం రాజకీయాల్లో రాణించలేవని చెప్పారట.. పాత రాజకీయ నేతలను చేర్చుకోకుండా కొత్త నేతలను అవినీతి రహితంగా ఉన్నవారిని చేర్చుకోవాలని.. యువత, మేధావులను రాజకీయాల్లోకి తీసుకొస్తే మెరుగైన ఫలితాలుంటాయని చెప్పినట్టు సమాచారం. ఈ ఏడాదే రజినీ రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసింది.

To Top

Send this to a friend