ఇండియన్ రోబో ఆర్మీ, పాక్, చైనాకు వణుకు

సైనికులు చనిపోయినప్పుడు దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడంతా మిషనరీ వ్యవస్థ, కంప్యూటర్లే పనిచేసేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఇంకా సరిహద్దుల్లో మన సైనికులు చనిపోవాల్సిందేనా..?ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లాంటి రావణ కాష్టం వల్ల ఎంతో మంది సైనికులు మృత్యువాతపడుతున్నారు. ఇలా ఎన్నాళ్లు అని ఆలోచించిన భారత శాస్త్రవేత్తలకు మెదళ్లకు దొరికిందే ఈ రోబో సైనికులు.. భారత అంతరిక్ష, రక్షణ పరిశోధన సంస్త డీఆర్డీఏ అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి భారత సైన్యం కోసం రోబో ఆర్మీ తయారు చేస్తోంది. అచ్చం సైనికుల మాదిరిగానే ఉండే ఈ రోబోలు.. మన సరిహద్దులను కాపాడనున్నాయి. అంతేకాదు శత్రువులపై విజృంభించనున్నాయి.

ఈ రోబోలను డీఆర్డీఏ ప్రస్తుతం సైన్యానికి అందుబాటులోకి తేవడానికి తుది పరీక్షలు చేస్తున్నట్టు సమాచారం. భారత ప్రభుత్వం, శాస్త్రవేత్తలు కాశ్మీర్ లో సైనికులకు ఎదురవుతున్న కష్టాలను తగ్గించేందుకే ఈ రోబోలను తయారు చేయాలని భావిస్తోంది.

ప్రస్తుతం భారత రక్షణ శాఖ తమకు 544 రోబోలు కావాలని డీఆర్డీఏకు కాంట్రాక్టు ఇచ్చేసింది. ఎనిమిది నెలలుగా డీఆర్డీఏ ఈ ప్రాజెక్టుపై పనిచేస్తోందట.. సైనికులకు ధీటుగా ఈ రోబోలు త్వరలోనే భారత సరిహద్దుల్లో కాపాలా కాస్తాయి. దీంతో శత్రుదేశం పాకిస్తాన్ కు, పక్కనే ఉన్న చైనాకు ఈ ఆర్మీ రోబోలు గుబులుపుట్టుస్తున్నాయని సమాచారం.

To Top

Send this to a friend