కేసుల్లో చిక్కుకున్న అర్జున్ రెడ్డి టీం..

అర్జున్ రెడ్డిపై ఏపీలో కూడా నిరసనలు మొదలయ్యాయి. ఏకంగా పోలీసు కేసులు కూడా నమోదు అవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకులు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్జున్ రెడ్డి ప్రదర్శనను వెంటనే నిలిపివేయాలని.. ఇలాంటి సినిమాలు యువతపై చెడు ప్రభావం చూపుతాయని.. ముఖ్యంగా బోల్డ్-ఇంటిమేట్ సీన్స్ చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ రమణ కుమార్ కు..రాజకీయ నేతలు గౌతమ్ రెడ్డి.. పుణ్యశీల.. యాదాల శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.

మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ కూడా విద్యార్థులపై చెడు ప్రభావాన్ని కలుగజేసే విధంగా ఈ సినిమా ఉందని, తక్షణమే నిలిపివేయాలని హైద్రాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అర్జున్ రెడ్డి సినిమా ఏపీలో నడుస్తుందో లేదో అన్న ఉత్కంఠ నెలకొంది.

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా అర్జున్ రెడ్డి. సందీప్ వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై వివాదాలు ఏ స్థాయిలో ఉన్నాయో.. అంతకు మించిన విజయాన్ని కూడా ఈ సినిమా అందుకుంటోంది. అయితే.. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచారంపై తెలంగాణలో కాంగ్రెస్ నాయకుడు వీ హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేయడం.. పోస్టర్లు చించేయడం. ఆ తర్వాత విజయ్ దేవరకొండ కౌంటర్ ఇవ్వడం.. దానికి వీహెచ్ నుంచి ఎన్ కౌంటర్ రావడం వరుసగా జరిగాయి. ఇప్పుడు వివాదం ఏపీకి కూడా పాకడంతో సినిమాపై అందరి ఫోకస్ నెలకొంది.

To Top

Send this to a friend