అప్పుల పాలయ్యాడు.. 


కేశినేని ట్రావెల్స్ మూసివేత వెనుక కారణం మనకు తెలిసింది ఒకటి అయితే వైసీపీ చెబుతున్న కారణం సంచలనం రేపుతోంది. ఇన్నాళ్లు విజయవాడ ట్రాన్స్ పోర్టు కమిషనర్ పై కేశినేని దాడి.. తరువాత చంద్రబాబు చీవాట్లతో రాజకీయంగా తనకు అడ్డుగా ఉన్న వ్యాపారం ట్రావెల్స్ ను కేశినేని నాని అమ్మేశాడని అందరూ అనుకున్నారు. కానీ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ రోజు సంచలన విషయం బయటపెట్టాడు..

భాస్కర్ రెడ్డి తిరుపతిలో మాట్లాడుతూ ‘కేశినేని నాని చంద్రబాబు తిట్టాడనే.. ట్రాన్స్ పోర్టు కమిషనర్ ను కొట్టాడనో అలిగి ట్రావెల్స్ అమ్మలేదు.. ఆయన ట్రావెల్స్ పేరు చెప్పి బ్యాంకుల్లో వందల కోట్ల రుణం తీసుకున్నాడు. నష్టాలు వచ్చి అవి చెల్లించే స్థోమత లేకపోవడం బస్సులు, ట్రావెల్స్ అమ్మేసి ఆ డబ్బులతో విజయవాడలో స్టార్ హోటల్ కడుతున్నాడని’ ఆరోపించారు.

కేశినేని నాని బండారం త్వరలోనే బయటపడనుందని.. విజయ్ మాల్యలాగా నాని మారబోతున్నాడని చెవిరెడ్డి జోస్యం చెప్పారు. బ్యాంకులకు కోట్లు ఎగ్గొట్టి అవి తీర్చలేకనే 80ఏళ్లుగా కొనసాగిస్తున్న ట్రావెల్స్ వ్యాపారాన్ని అమ్మేశాడని ఆరోపించారు.

To Top

Send this to a friend