నంద్యాల ఎఫెక్ట్: జగన్ పొత్తు వద్దంటున్న అమిత్ షా

తెలుగుదేశం పార్టీని తక్కువ అంచనా వేసిన అమిత్ షా మళ్లీ లైన్ లోకి వచ్చినట్టే ఉన్నారు… ‘‘తెలుగుదేశం పార్టీకి అస్సలు బలం లేదు అని.. మా సత్తా మీకు అర్ధం కావట్లేదు అని… కావాలంటే నంద్యాలలో 50 వేల మెజారిటీతో గెలిచి మా బలం ఏంటో, చంద్రబాబు బలం ఏంటో చూపిస్తాను’’ అని ఛాలెంజ్ చేసిన జగన్ మాటలు విని చంద్రబాబుకి ఏదో ఝలక్ ఇద్దాం అనుకున్న అమిత్ షా కి నంద్యాల రిపోర్ట్స్ చూసి దిమ్మ తిరగినట్టు సమాచారం.

జగన్ బీజేపీలో చేరటం ఖాయం అనుకున్నారు అందరూ.. 29న అమిత్ షా విజయవాడ పర్యటనలో, జగన్ విలీనం అయిపోతాడు అని ఊహాగానాలు వెలువడ్డాయి. విజయసాయి కేంద్ర మంత్రి అవుతాడని అనుకున్నారు.. కానీ, అమిత్ షా పర్యటన అర్ధాంతరంగా రద్దు అయ్యింది..

అసలు కారణం, జగన్ చెప్పినవి అన్ని గాలి మాటలు అని.. నంద్యాలలో తెలుగుదేశం భారీ మెజారిటీతో గెలుస్తుంది అని అమిత్ షా కి వచ్చిన రిపోర్ట్స్.. అందునా దాదాపు 40% ముస్లింలు ఉన్న ప్రాంతంలో, చంద్రబాబు హవా చూసి అమిత్ షా షాక్ అయ్యారనే వార్త!! నిజానికి ఇక్కడ చంద్రబాబు బీజేపీ సపోర్ట్ తీసుకోలేదు.. ఒంటరిగా వెళ్లి, భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అనే సంకేతం అందటంతో, అమిత్ షా కి వాస్తవ పరిస్థితి అర్ధమై, విజయవాడ పర్యటన వాయదా వేసుకున్నట్టు పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

అంతే కాదు, ఇవాళ మీడియాతో మాట్లాడుతూ, తెదేపాతో తమ మైత్రి కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఆ పార్టీతో, చంద్రబాబుతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.. కొత్త స్నేహితుల ప్రస్తావన అవసరం లేదన్నారు. జగన్ తో పొట్టు వార్తలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇలా అమిత్ షాకు వైసీపీపై ఉన్న నమ్మకం కరిగిపోయి పాత మిత్రుడికోసం మళ్లీ కలవరింతలు మొదలయ్యాయి.

To Top

Send this to a friend