ఏపీ డీజీపీనే భయపెడుతున్నారే….


ఏపీలోని బాపట్ల సబ్ డివిజన్ లో 6 నెలల వ్యవధిలోనే 16మంది బాలికల కిడ్నాప్.. అంతా టీనేజీ అమ్మాయిలే .. ఇప్పటికి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1500 మంది బాలికలు మిస్సింగ్ అయినట్టు కేసులు నమోదయ్యాయి. ఇంత తీవ్రంగా బాలికలు గల్లంతవడం ఏ రాష్ట్రంలోనూ జరగలేదట.. ప్రేమ, డబ్బు ఆశ, దుబాయ్ కి పంపిస్తామని ఇలా ప్రలోభ పెట్టి టీనేజ్ అమ్మాయిలను ఎగరేసుకుపోతున్నారు. నిందితులందరూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ పోలీసులకు చిక్కడం లేదు. దీంతో తల్లిదండ్రులు, మీడియా నుంచి పోలీసులపై తీవ్ర ఒత్తిడి అధికమైంది. పోలీసులు తక్షణం నిందులను పట్టుకోవాలని స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ డీజీపీ సాంబవివరావుకు ఫోన్ చేసి చెప్పడం గమనార్హం.

ఏపీ డీజీపీ స్వయంగా విలేకరుల ముందుకు వచ్చారు. ఇటీవల భట్టిప్రోలులో కిడ్నాప్ అయిన 13 ఏళ్ల బాలికను పట్టుకున్నామని తెలిపారు. నిందితుడు శ్రీరామ నాగేశ్వరరావును మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుడు సాంకేతిక పరిజ్ఞానం కలవాడని.. అందుకే చాలా రోజులు దొరకలేదన్నారు. నిందితుడికి సంబంధించిన బంధువులు, ఫ్రెండ్ , లవర్ పై నిఘా పెట్టగా ఓ రోజు నిందుతుడు విశాఖలోని లవర్ కి  ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నాడో తెలిసిందన్నారు. కశ్మీర్ లో బాలికతో కలిసి తలదాచుకున్నట్టు తెలిసి అక్కడి పోలీసుల సాయంతో పట్టుకున్నామని.. తెలిపారు.

ఏపీలో ప్రేమ, వ్యామోహం, డబ్బు ఆశతో బాలికలు గాడితప్పుతున్నారని ఏపీ డీజీపీ సాంబశివరావు వాపోయారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై నిరంతర నిఘా పెడితే ఇలా బాలికల కిడ్నాప్ లు జరగవని వాపోయారు. ఏపీ పోలీసులకు సవాల్ గా మారిన కిడ్నాప్ లకు పరిష్కారం తల్లిదండ్రులపైనే ఉందని.. ‘మీకు దండాలు పెడుతా మీ పిల్లలపై నిఘా పెట్టండని’ డీజీపీ తల్లిదండ్రులను వేడుకోవడం కొసమెరుపు..

To Top

Send this to a friend