ప్రభాస్‌, అనుష్క పబ్‌లో పట్టుబడ్డారు


‘మిర్చి’, ‘బాహుబలి’ చిత్రాల్లో ప్రభాస్‌కు జోడీగా నటించిన ముద్దుగుమ్మ అనుష్క రెబల్‌ స్టార్‌కు సరి జోడి అనిపించుకుంది. ‘బాహుబలి’ సినిమా చేస్తున్నప్పటి నుండి వీరిద్దరి మద్య వ్యవహారం నడుస్తుందని, పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు, త్వరలోనే ఒక గుడ్‌ న్యూస్‌ వినిపించే అవకాశం కూడా ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు అట్లుంచితే ‘సాహో’ సినిమాలో కూడా ప్రభాస్‌కు జోడీగా అనుష్కను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజమే అని తేలిపోయింది.

నేటి నుండి ‘సాహో’ చిత్రీకరణ ప్రారంభం అయ్యింది. హైదరాబాద్‌లోని ఒక పబ్‌లో ఈ చిత్రీకరణ షురూ అయినట్లుగా తెలుస్తోంది. ఆ షూటింగ్‌లో ప్రభాస్‌తో పాటు అనుష్క కూడా పాల్గొనడంతో ‘సాహో’లో అనుష్క హీరోయిన్‌ అంటూ తేలిపోయింది. అనుష్క ప్రస్తుతం ‘భాగమతి’ చిత్రం షూటింగ్‌లో కూడా పాల్గొంటుంది. ఈ రెండు సినిమాలు కూడా యూవీ క్రియేషన్స్‌లోనే తెరకెక్కుతున్నాయి.

‘సాహో’ చిత్రంలో అనుష్క హీరోయిన్‌గా నటిస్తుందా లేక ముఖ్య పాత్రలో కనిపించనుందా అనేది ప్రస్తుతం చూడాల్సి ఉంది. లేదంటే అనుష్క సరదాగా ‘సాహో’ చిత్ర షూటింగ్‌ స్పాట్‌కు వచ్చిందా అనేది కూడా తెలియాల్సి ఉంది. తాజాగా షూటింగ్‌ ప్రారంభం అయినది కనుక త్వరలోనే హీరోయిన్‌పై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.

To Top

Send this to a friend