అంతర్యుద్ధం తప్పదా?


తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కేటీఆర్ ను కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో సీఎం బోతున్నారనే ఊహాగానాలు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తన పత్రికలో నిర్వహించిన బంపర్ డ్రాకు కేటీఆర్ వెళ్లడం.. ఆ తర్వాతిరోజే హరీష్ రావుతో రాధాకృష్ణ ఇంటర్వ్యూ నిర్వహించారు. కేటీఆర్ ను సీఎం చేస్తే తనకు అభ్యంతరం లేదని చెప్పించారు. ఆ ఇంటర్వ్యూ పూర్తికాగానే కేసీఆర్.. కేటీఆర్ ను ప్రజలకు చేరువ చేయాలని జనహిత పేరుతో బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. కేటీఆర్ ను జనంలో ప్రమోట్ చేయడానికే ఇవన్నీ అని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాలన్నీ గమనించిన హరీష్ రావు మాట్లాడుతూ మరో పదేళ్లు కేసీఆర్ సీఎం గా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. కేటీఆర్ పై మాట దాటవేశారు.

మంగళవారం జగిత్యాల జిల్లాకేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభ వేదికపై దీనిపై కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ‘కేసీఆర్ మరో పదేళ్లు సీఎంగా ఉంటారని.. నాన్న వైదొలిగి నాకు సీఎం పదవి ఇస్తారనేది ఊహాగానాలేనన్నారు. సీఎం కావాలనే తొందర నాకు లేదని స్పష్టం చేశారు. అంతేకాదు.. హరీష్ రావు కాంగ్రెస్ లోకి వెళ్లరని.. హరీష్ తో నాకు విభేదాలు లేవు’ అని స్పష్టం చేశారు..

కేసీఆర్.. తన కొడుకు కేటీఆర్ ను సీఎం చేస్తే మనస్తాపంతో హరీష్ కాంగ్రెస్ లోకి వెళతారనే ప్రచారం జరుగుతోంది. దీంతో కేటీఆర్ వ్యూహాత్మకంగా తాను సీఎం ఇప్పుడే కానని.. హరీష్ చెప్పినట్టు మరో పదేళ్లు సీఎంగా ఉంటారని చెప్పారు. కేటీఆర్ టీఆర్ఎస్ ముక్కలు కాకుండా.. అంతర్యుద్ధం రాకుండా ఉండేందుకు ఇలా వ్యాఖ్యానించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ కేసీఆర్ కు ఆరోగ్యం బాగాలేకపోతే వచ్చేసారి కేటీఆర్ ను సీఎం గా చూడొచ్చని.. కానీ బాగుంటే కేసీఆరే మరో పదేళ్లు కొనసాగతారని బావిస్తున్నారు. కేటీఆర్ ను సీఎం చేస్తే హరీష్ తో పాటు సీనియర్లు దూరమయ్యే చాన్సుంది. అందుకే ఈ విషయంలో అంతర్యుద్ధం రాకుండా చాలా జాగ్రత్తగా అడుగులు వేసేందుకు కేసీఆర్ అండ్ కో ప్రయత్నిస్తుందని.. కేటీఆర్ మాటలను బట్టి అర్థమవుతోందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

To Top

Send this to a friend